సెల్‌ఫోన్‌ దుర్వినియోగానికి పాల్పడొద్దు | Call Phone Not Use To Traffic Police On Duty | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌ దుర్వినియోగానికి పాల్పడొద్దు

Jul 22 2026 9:43 AM | Updated on Jul 22 2026 12:31 PM

Call Phone Not Use To Traffic Police On Duty

సాక్షి, హైదరాబాద్‌: ట్రాఫిక్‌ విభాగం ఉన్నతాధికారులను సిబ్బంది సెల్‌ఫోన్ల వినియోగం పెద్ద తలనొప్పిగా మారింది. విధుల్లో ఉండి ఫోన్‌తో టైమ్‌పాస్‌ చేస్తున్నారనే సమాచారం ఉన్నా... వినియోగంపై నిషేధం విధించే అవకాశం లేదు.  ఫోన్‌ను అవసరమైన మేరకు, అధికారిక విధుల కోసమే వాడేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని స్థాయిల సిబ్బందికీ అవగాహన కలి్పంచడానికి చర్యలు తీసుకుంటున్నారు. 

ట్రాఫిక్‌ విభాగంలో పని చేస్తూ, పాయింట్‌ డ్యూటీల్లో ఉంటున్న సిబ్బంది సెల్‌ఫోన్‌తో టైమ్‌పాస్‌ చేస్తున్న ఉదంతాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ట్రాఫిక్‌ బూత్‌లతో పాటు రహదారుల మీద ఉంటున్న ట్రాఫిక్‌ పోలీసులు విధులను మరిచి తమ ఫోన్లలో రీల్స్, వీడియోలు, సోషల్‌మీడియా చూస్తూ టైమ్‌పాస్‌ చేస్తున్నట్లు కొన్ని ఫొటోలు సైతం వెలుగులోకి వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో విధుల్లో ఉండగా.. ఇందుకు సంబంధించిన అంశాలు కాకుండా ఇతరాల కోసం సెల్‌ఫోన్‌ వాడద్దని స్పష్టం చేశారు. ఈ కోణంలో అవగాహన కల్పించడంతో పాటు సిబ్బందిపై నిఘా వేశారు.  

 

 


   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement