breaking news
call phones
-
అంగన్వాడీల్లో మళ్లీ హలో.. హలో..
ఇందూరు, న్యూస్‌లైన్: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో మళ్లీ హలో.. హలో.. వినిపించనుంది. గత రెండు నెలల క్రితం సెల్‌ఫోన్ సేవలు నిలిచాయి. బకాయి బిలుల్లు చెల్లించకపోవడమే ఇందుకు కారణం. అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, సీడీపీఓలు రాష్ట్ర అధికారులకు ఎస్ఎంఎస్లు చేయకపోవడంతో రోజువారి, వారంతపు, నెల సమాచారం కొరవడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాలో బీఎస్ఎన్ల్ కంపెనీకి బకాయి పడిన రూ.5లక్షలను విడుదల చేసింది. దీంతో అంగన్వాడీల్లో సెల్ సేవలు పునరుద్దరణ అయ్యాయి. సెల్ ద్వారా సోమవారం నుంచే ఎస్ఎంఎస్తో ఆన్లైన్లో ప్రతి సమాచారం రాష్ట్ర అధికారులకు చేరవేయాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ రాములు జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలకు, సూపర్వైజర్లకు, సీడీపీఓలకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో మాదిరి ఎస్ఎంఎస్ చేయడంలో నిర్లక్ష్యం చేస్తే వేతనంలో కోతలు విధిస్తామని హెచ్చరికలూ పంపారు. మూడు రకాల సమాచారం.. మినీ, మెయిన్ కలిపి జిల్లాలో మొత్తం 2400లకుపైగా అంగన్వాడీ కేంద్రాలున్నాయి. మొదటగా ఇందులో పని చేసే కార్యకర్తలు ప్రతి రోజు 11 నుంచి 12గంటల్లోపు పూర్వ ప్రాథమిక విద్య(ప్రీ స్కూల్)లో ఎందరు పిల్లలు వచ్చారు, ఎందరికి భోజనం పెట్టారు అనే వివరాలతో పాటు గర్భిణులు, బాలింతలు వివరాలు ఐసీడీఎస్ డెరైక్టరేట్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. రోజు వారీగా సరుకుల ఖర్చు, బ్యాలెన్స్ వివరాలను కూడా చేరవేయాలి. రెండోది సందర్భ సమాచారం. గ్రామ, పట్టణ ప్రాంతాల్లో మాతాశిశు మరణాలు జరిగిన వెంటనే సమాచారమందించాలి. మూడోది ప్రతి నెలా అంగన్వాడీ ప్రోగ్రెస్ రిపోర్టులను ఎస్ఎంఎస్ చేయాలి. కార్యకర్త, సూపర్వైజర్, సీడీపీఓలు ఇక ప్రతీది ఎస్ఎంఎస్ ద్వారానే సమాచారమందించాలి. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు.. -రాములు, ఐసీడీఎస్ పీడీ రెండు నెలల క్రితం నిలిచిపోయిన సెల్‌ఫోన్ సేవలు ప్రభుత్వం నిధులు మంజురు చేయడంతో పునరుద్దరణ చేయించాం. సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు, సూపర్వైజర్లు, సీడీపీఓలు రోజువారీ సమాచారాన్ని తప్పకుండా పంపించాలి. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఆదేశాలను విధిగా పాటించాలి. -
సెల్ వాడకం నిషేధం!
సాక్షి, ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కు చెందిన ప్రముఖ ఆస్పత్రులో సిబ్బంది పనితీరును మెరుగుపరిచేందుకు పరిపాలన విభాగం నడుం బిగించింది. పనివేళల్లో మొబై ల్ ఫోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు వైద్య, విద్యా శాఖ డెరైక్టర్ డాక్టర్ సుహాసిని నాగ్దా ఆదేశాలు జారీచేశారు. రోగుల ఇబ్బందులను దృష్టి లో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఒకవేళ ఆదేశాలను బేఖాతరుచేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా పరేల్‌లోని కేం, సైన్‌లోని లోకమాన్య తిలక్, ముంబెసైంట్రల్‌లోని నాయర్ ఆస్పత్రుల్లో ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. త్వరలో మిగతా ఆస్పత్రులకు కూడా వర్తింపజేస్తామని సుహాసిని తెలిపారు. ఈ ఆదేశాలను సదరు ఆస్పత్రి యాజ మాన్యాలు తప్పకుండా పాటించాలని హెచ్చరించా రు. అనేక సందర్భాలలో ఆపరేషన్ థియేటర్లలో, రోగుల వద్ద కూర్చున్న వైద్యులు, సెలైన్ ఎక్కిస్తుం డగా లేదా బాటిల్ మారుస్తుండగా నర్సులు, రోగి నాడి పరీక్షిస్తుండగా సిస్టర్లు, స్ట్రెచర్‌పై లేదా వీల్ చైర్‌పై రోగులను ఎక్స్‌రే, రక్త పరీక్షలకు ల్యాబ్‌కు తీసుకెళుతుండగా వార్డు బాయ్‌లు ఇలా ఎవరిని చూసినా పనివేళల్లో మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. వీటివల్ల రోగులకు తప్పుడు చికిత్స, తప్పుడు మందులు ఇవ్వడంవల్ల వారి ప్రాణాలకు హాని జరిగే ప్రమాదం ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుహాసిని చెప్పారు. ముఖ్యంగా వైద్యులు మొదలుకుని నాలు గో శ్రేణి ఉద్యోగుల వరకు విధి నిర్వహణలో ఉండ గా సెల్ఫోన్లో మాట్లాడేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అనేక ఆస్పత్రుల్లో కింది స్థాయి సిబ్బంది విశ్రాంతి గదిలో లేదా పాంట్రి వార్డులో మొబైల్లో పాటలు వినడం, పజిల్, గేమ్ ఆడడం లాంటివి చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. వీటి ధ్యాసలో పడి రోగులను పట్టించుకోవడం లేదని అనేక ఫిర్యాదులు ఇదివరకే అందాయి. ఇటీవల కేంలో ఓ రోగి ఆరోగ్యం క్షీణించిందని బంధువులు చెబుతున్నప్పటికీ ఫోన్లో మాట్లాడడంలో నిమగ్నమైన సిస్టర్ వారి గోడు పట్టించుకోలేదు. ఫలితంగా ఆ రోగి ఆరోగ్యం మరింత క్షీణించడంతో చివరకు ఐసీయూ కి తరలించాల్సి వచ్చింది. ఆర్థోపెడిక్, న్యూరో సర్జరీ, రేడియాలజీ, ప్రసూతి వార్డు తదితర కీలక శాఖల్లో పనిచేసే డాక్టర్లు తమ వెంట మొబైల్ఫోన్లు తీసుకెళుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ముఖ్యం గా ప్రభుత్వ, కార్పొరేషన్ ఆస్పత్రుల్లో పనిచేసే డాక్టర్లకు అత్యధిక శాతం సొంత ప్రాక్టీస్ ఉంటుంది. దీంతో డాక్టర్లకు వారి సొంత క్లినిక్ లేదా ఆస్పత్రుల నుంచి ఫోన్లు వస్తున్నట్లు విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ రోగుల పరిస్థితి విషమిస్తే వెంటనే బయలుదేరిపోతారని, ఇక్కడి బాధ్యతలు తమ కింద పనిచేసే ట్రెయినీ వైద్యుల నెత్తిన వేసేస్తారని తెలుస్తోంది. వీరి నిర్వాకంవల్ల రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉందని, దీంతో మొబైల్ ఫోన్లు నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీచేశామని సుహాసిని పేర్కొన్నారు.