ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

May 14 2026 6:21 AM | Updated on May 14 2026 6:21 AM

మాదాపూర్‌: మానసిక ఒత్తిడికి తట్టుకోలేక ఓ ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. మాదాపూర్‌ పోలీసులు తెలిపిన మేరకు.. పర్వత్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌లో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో సూర్యాపేటకు చెందిన పూజరెడ్డి (16) ఇంటర్‌ ఎంపీసీ చదువుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే సెకెండ్‌ ఇయర్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. పరీక్షల మానసిక ఒత్తిడితో తన రూమ్‌లో మంగళవారం రాత్రి హాస్టల్‌లో ఎవరూలేని సమయంలో చున్నీతో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి గోపిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement