వడదెబ్బతో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో వ్యక్తి మృతి

May 14 2026 6:21 AM | Updated on May 14 2026 6:21 AM

మల్కాజిగిరి: మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ జితేందర్‌ సింగ్‌ తెలిపిన మేరకు.. ఉప్పరిగూడకు చెందిన దార శంకర్‌(53) కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం మల్కాజిగిరి చౌరస్తాలో అపస్మారక స్థితిలో పడివున్న శంకర్‌ గురించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా ప్రాంతానికి వచ్చిన 108 సిబ్బంది అప్పటికే శంకర్‌ మృతి చెందాడని చెప్పారు. దీంతో పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement