జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగవంతం చేయాలి

May 14 2026 6:21 AM | Updated on May 14 2026 6:21 AM

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగవంతం చేయాలి ప్రశాంతంగా పాలిసెట్‌ ఎంట్రెన్స్‌

సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రారంభమైన జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ ముకుంద రెడ్డి కోరారు. బుధవారం మీడియా అకాడమీ కార్యాలయంలో జర్నలిస్టు హౌసింగ్‌ సోసైటీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముకుంద రెడ్డి మాట్లాడుతూ... దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపుతుందన్నారు. ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కె. శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ... ఈ నెల 21న జరిగే క్యాబినెట్‌ సమావేశం నాటికి హైదరాబాద్‌లో ఉన్న అన్ని సొసైటీల పూర్తి వివరాలను జర్నలిస్టుల సంఖ్యతో కూడిన నివేదికను తయారు చేయాలన్నారు. ఇందుకు అన్ని సోసైటీలు సమష్టిగా సహకరించాలని కోరారు. అర్హులైన జర్నలిస్టులను మాత్రమే జాబితాలో చేర్చాలని ఆయన ప్రతినిధులను కోరారు.

నూతన డీజీపీలకు సత్కారం

సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ పోలీసు శాఖలో పదోన్నతులు పొందిన ఉన్నతాధికారులను ఇంటర్నేషనల్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ (ఐసీపీఆర్‌) జాతీయ అధ్యక్షుడు డా. అజయ్‌ కుమార్‌ అగర్వాల్‌ మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. స్వచ్ఛ అధికార్‌ ఇండియా, టేస్ట్‌ బడ్డర్స్‌ డైరెక్టర్‌ కేతన్‌ అగర్వాల్‌తో కలిసి ఆయన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌, లా అండ్‌ ఆర్డర్‌ డీజీ మహేష్‌ భగవత్‌, ఆక్టోపస్‌ డీజీ అనిల్‌ కుమార్‌ను కలిసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డా. అజయ్‌ కుమార్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత, ఆధునిక పోలీసింగ్‌ వ్యవస్థ బలోపేతానికి అధికారులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు.

విజయనగర్‌కాలనీ: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ప్రశాంతంగా ముగిసింది. మాసబ్‌ట్యాంక్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలోని పరీక్ష కేంద్రంలో 2,570 మంది విద్యార్థులకు గాను 2,266 మంది విద్యార్థులు హాజరైనట్లు పరీక్షా కేంద్రం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.చంద్రశేఖర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement