సీఎం సార్‌.. థ్యాంక్స్‌ | - | Sakshi
Sakshi News home page

సీఎం సార్‌.. థ్యాంక్స్‌

May 13 2026 5:02 AM | Updated on May 13 2026 5:02 AM

సీఎం సార్‌.. థ్యాంక్స్‌

రేవంత్‌ చిత్రపటానికి 2008 డీఎస్సీ అభ్యర్థుల క్షీరాభిషేకం

లక్డికాపూల్‌: అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 2008 డీఎస్సీ అభ్యర్థులు 1,175 మందిని ఉపాధ్యాయులుగా నియమించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌కు 2008 డీఎస్సీ అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అనుకూలంగా నినాదాలు చేశారు. 17 ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమకు సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగాలిచ్చి ఆదుకున్నారని సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞత లు తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన పోస్టింగ్స్‌ ఇచ్చారని, అయితే కొత్త జిల్లాల ప్రాతిపదికల పోస్టింగ్‌ మార్చాలని సీఎం ప్రజావాణి ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ జి.చిన్నారెడ్డికి వినతిపత్రం అందజేశారు.

సీఎం ప్రజావాణికి 393 దరఖాస్తులు

లక్డీకాపూల్‌: మహా త్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన 221వ సీఎం ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 393 దరఖాస్తులు అందాయి. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 190, రెవెన్యూ శాఖకు సంబంధించి 39, ఇందిరమ్మ ఇండ్ల కోసం 97, ప్రవాసి ప్రజావాణికి 02, ఇతర శాఖలకు సంబంధించి 65 దరఖాస్తులు అందాయి. సీఎం ప్రజావాణి ఇన్‌చార్జ్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ జి.చిన్నారెడ్డి దరఖాస్తులు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు. కార్యక్రమంలో ఏసీపీ ఉమేందర్‌, ఎన్‌ఆర్‌ఐ సలహామండలి చైర్మన్‌ బీఎం వినోద్‌ కుమార్‌, వైస్‌ చైర్మన్‌ మంద భీంరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement