ఎన్‌టీఏను రద్దు చేయాలని ఆందోళన | - | Sakshi
Sakshi News home page

ఎన్‌టీఏను రద్దు చేయాలని ఆందోళన

May 13 2026 5:02 AM | Updated on May 13 2026 5:02 AM

ఎన్‌టీఏను రద్దు చేయాలని ఆందోళన

విద్యానగర్‌ సర్కిల్‌లో బైఠాయించిన విద్యార్థి జేఏసీ

సుందరయ్య విజ్ఞాన కేంద్రం: నీట్‌ పరీక్ష నిర్వహించే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)ను రద్దు చేయాలని మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. సంతలో సరుకులాగా ప్రశ్నపత్రాలను విక్రయించడం వల్ల దిక్కుతోచనిస్థితిలో 28 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని విచారం వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యానగర్‌ సర్కిల్‌ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ప్రధానమంత్రి మోదీ వెంటనే స్పందించి సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. వైద్యవిద్య పరీక్షలను ఆయా రాష్ట్రాలకే అప్పగించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు నందగోపాల్‌, సాయి, సతీష్‌, ప్రవీణ్‌, రాజశంకర్‌, హరిశంకర్‌, వినయ్‌, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement