కంపోస్ట్‌ తయారీపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

కంపోస్ట్‌ తయారీపై అవగాహన

May 13 2026 5:02 AM | Updated on May 13 2026 5:02 AM

కంపోస్ట్‌ తయారీపై అవగాహన నేడు పాలిసెట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఆడపిల్లకు అన్యాయం చేస్తే ఊరుకోం 16 నుంచి ఓయూ డిగ్రీ పరీక్షలు

సాక్షి, సిటీబ్యూరో: ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’కింద 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంగళవారం జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీల్లో రెసిడెన్సియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లకు కంపోస్ట్‌ తయారీపై అవగాహన సదస్సులు నిర్వహించారు. గృహస్థాయిలో కంపోస్టింగ్‌ను ప్రోత్సహించడం తద్వారా పర్యావరణ పరిస్థితులను మెరుగుపరచడం ఈ కార్యక్రమం ము ఖ్యోద్దేశమని సంబంధిత యూబీడీ విభాగం అధికారులు పేర్కొన్నారు. వ్యర్థ పదార్థాల విభజన, కంపోస్ట్‌ బిన్‌ల వాడకం, నిర్వహణ పద్ధతులు, కంపోస్ట్‌ వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమాలకు హాజరైన వారి నుంచి సానుకూల స్పందన వ్యక్తమైంది. తమ కాలనీలోకంపోస్టింగ్‌ కార్యకలాపాలను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు.

విజయనగర్‌ కాలనీ: పాలిసెట్‌కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మాసబ్‌ట్యాంక్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.చంద్రశేఖర్‌ తెలిపారు. మాసబ్‌ట్యాంక్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో మంగళవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. బుధవారం ఉదయం 11 నుంచి 1.30 వరకు పరీక్ష ఉంటుందన్నారు.

బండి భగరీథ్‌ను అరెస్టు చేయాలి

బీఆర్‌ఎస్‌ మహిళా నేతల డిమాండ్‌

వెంగళరావునగర్‌: ఎప్పుడూ న్యాయం, ధర్మం అంటూ మాట్లాడే కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఇప్పుడు ఒక ఆడపిల్ల విషయంలో ఎందుకు కొడుక్కి వత్తాసు పలుకుతున్నారని బీఆర్‌ఎస్‌ మహిళా సంఘం నేతలు ప్రశ్నించారు. మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన సంజయ్‌ కుమారుడు భగీరథపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మంగళవారం బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ జడ్‌పీ చైర్మన్లు తుల ఉమ, చారులత, జూబ్లీహిల్స్‌ ఇన్‌చార్జి మాగంటి సునీత, తదితరులు డిమాండ్‌ చేశారు. మంగళవారం మధురానగర్‌లోని తెలంగాణ బాలల హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌ సీతా దయాకర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. భగీఽరథ్‌పై పోక్సో కేసు నమోదైనప్పటికీ చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. నిందితుడిపై చర్యలు తీసుకుని బాధిత బాలికకు న్యాయం చేయాలని, చట్టం ముందు అందరూ సమానులనే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలన్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 16 నుంచి వివిధ డిగ్రీ కోర్సుల సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ ఇతర డిగ్రీ రెగ్యులర్‌ కోర్సుల 4, 6 సెమిస్టర్‌ పరీక్షలతోపాటు 1 నుంచి 6 వరకు బ్యాక్‌లాగ్‌ సెమిస్టర్‌ పరీక్షలు జరగనున్నాయి. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్‌సైట్లో చూడవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement