రాజ్యాంగం..దేశానికి కాపలా కాసే సైనికుడు | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగం..దేశానికి కాపలా కాసే సైనికుడు

May 12 2026 6:18 AM | Updated on May 12 2026 6:18 AM

సుల్తాన్‌బజార్‌ : భారత రాజ్యాంగం సరిహద్దుల్లో అప్రమత్తంగా దేశానికి కాపలా కాసే సైనికుడిలాంటిదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు శ్రీధర్‌రెడ్డి సహిత్య పురస్కారాన్ని సుదర్శన్‌ రెడ్డికి ప్రదానం చేశారు. పరిషత్‌ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో తెలంగాణ ప్రణాళిక మండలి ఉపాధ్యక్షులు డాక్టర్‌ జి.చిన్నారెడ్డి పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ న్యాయవ్యవస్థ పాత్ర అనే అంశంపై సుదర్శన్‌రెడ్డి ప్రసంగింగాచారు. రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయ వ్యవస్థ తప్పక జోక్యం చేసుకోవాలన్నారు. తాను ఓడిపోతానని తెలిసినా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో నిలబడడానికి కారణం దేశం పట్ల ఉన్న నిబద్ధతేనని సుదర్శన్‌రెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement