ఆర్టీఏలో పైరవీల జోరు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీఏలో పైరవీల జోరు

May 5 2026 6:50 AM | Updated on May 5 2026 6:50 AM

మెసేజ్‌లకే పరిమితమైన ‘సిలిండర్‌’
బుకింగ్‌ తర్వాత 15 రోజులు ఎదురుచూపులు

కిలో లెక్కన.. ఆకాశమే హద్దు!

డొమెస్టిక్‌,కమర్షియల్‌ గ్యాస్‌ ధరలను కిలోల లెక్కన బేరీజు వేస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. గృహ వినియోగ గ్యాస్‌ కిలో ధర సుమారు రూ. 66.55 పైసలు పలుకుతుండగా, వాణిజ్య గ్యాస్‌ కిలో ధర సుమారు రూ. 174.47 అంటే, వాణిజ్య గ్యాస్‌ ధర గృహ వినియోగ ధర కంటే దాదాపు 2.6 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ భారీ లాభాల కోసమే కంపెనీలు కమర్షియల్‌ ఆర్డర్లకే ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఐదు రోజులుగా డొమెస్టిక్‌ రీఫిల్స్‌ లోడ్‌ సరిగా రావడం లేదని గ్యాస్‌ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి.

సాక్షి, సిటీబ్యూరో

హా నగరంలో వంటగ్యాస్‌ పంపిణీ వ్యవస్థ పడకేసింది. చమురు సంస్థల నిర్లక్ష్యం, డీలర్ల ధనదాహం వెరసి సామాన్యుడి వంటింట్లో ‘గ్యాస్‌’ మంటలు రేపుతోంది. రీఫిల్‌ బుక్‌ చేస్తే మూడు, నాలుగు రోజుల్లో వస్తుందని ఊదరగొడుతున్న చమురు సంస్థలు ఆచరణలో మాత్రం వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. బుకింగ్‌కూ బుకింగ్‌కూ మధ్య గడువు పెంచిన సంస్థలు, తీరా బుక్‌ చేశాక 15 రోజులు గడిచినా సిలిండర్‌ను గడప దాటించకపోవడం పంపిణీ వైఫల్యానికి పరాకాష్టగా మారింది. ఫోన్లకు వచ్చే సంక్షిప్త సమాచారాలు (ఎస్‌ఎంఎస్‌) తేదీల మార్పుతో కాలక్షేపం చేస్తుంటే, అటు డీలర్లు స్టాక్‌ లేదంటూ కాలయాపన చేయడంతో గ్యాస్‌ కోసం సామాన్యులు నిరీక్షణ మంత్రం జపిస్తున్నారు.

బుకింగ్‌ ఉంటే.. డెలివరీ గగనం

ప్రస్తుతం గ్యాస్‌ కనెక్షన్‌ నిబంధనల ప్రకారం ఒక బుకింగ్‌కు, మరో బుకింగ్‌కు మధ్య 25 రోజుల కనీస గడువు ఉండాలి. అయితే.. బుక్‌ చేసిన తర్వాత వారం రోజుల్లోనే సిలిండర్‌ ఇంటికి చేరుతుందన్న చమురు సంస్థల ప్రకటనలు కేవలం ఫోన్‌ మెసేజ్‌లకే పరిమితమవుతున్నాయి. వాస్తవానికి బుకింగ్‌ చేసిన తర్వాత 15 రోజులు గడిస్తే తప్ప సిలిండర్‌ గడపకు చేరని పరిస్థితి నెలకొంది. రీఫిల్‌ బుక్‌ చేసిన వెంటనే ఒక తేదీని, వారం తర్వాత మరో తేదీని సూచిస్తూ కంపెనీలు పంపుతున్న సంక్షిప్త సమాచారం వినియోగదారులను గందరగోళానికి గురి చేస్తోంది.

కమర్షియల్‌ లాభం.. డొమెస్టిక్‌పై నిర్లక్ష్యం

చమురు సంస్థలు గృహ వినియోగ (డొమెస్టిక్‌) గ్యాస్‌ కంటే వాణిజ్య (కమర్షియల్‌) సిలిండర్ల సరఫరాకే మొగ్గు చూపుతున్నా యనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ధరల్లో ఉన్న భారీ వ్యత్యాసమే. తాజాగా 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌ ధర ఏకంగా రూ. 993 పెరిగి రూ. 3,315కి చేరింది. 14.5 కిలోల డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ. 965 వద్ద కొనసాగుతోంది. ఈ ధరల అసమానత సరఫరా గొలుసుపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

బదిలీల జాబితాపై మొదలైన కసరత్తు

పక్కదారి పడుతున్న ‘రీఫిల్‌’ బండి

సరఫరా తగ్గిన తరుణంలో అందుబాటులో ఉన్న కొద్దిపాటి స్టాక్‌ను కూడా ఏజెన్సీలు పక్కదారి పట్టిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గృహ వినియోగ సిలిండర్లను అధిక ధరలకు హోటళ్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, ఇతర వాణిజ్య సంస్థలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. డీలర్ల అక్రమ దందాతో సామాన్య గృహిణులు గ్యాస్‌ అయిపోయిన వేళ ప్రత్యామ్నాయం లేక అవస్థలకు గురి కావాల్సివస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement