విద్యార్థిని అవయవాల దానం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థిని అవయవాల దానం

May 5 2026 6:50 AM | Updated on May 5 2026 6:50 AM

విద్యార్థిని అవయవాల దానం

బంజారాహిల్స్‌: ఇటీవల వెలువడ్డ ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా ఆమె కళ్లతోపాటు ఇతర అవయవాలను తల్లిదండ్రులు దానం చేసి తమ కూతురు మరికొందరికి ప్రాణం పోయాలన్న సంకల్పం నెరవేర్చుకున్నారు. ఫిలింనగర్‌లోని ఎమ్మార్సీ కాలనీకి చెందిన లావణ్య సాయి(16) ఇంటర్‌ ఫెయిల్‌ అయింది. తీవ్ర మనస్తాపానికి గురైన లావణ్య ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. అయితే తమ కూతురు మట్టిలో కలిసిపోకూడదని మరికొందరికి చూపు నివ్వడమే కాకుండా ప్రాణం పోయాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఉంగరాల మూర్తి–సుబ్బలక్ష్మి దంపతులు మానవత్వాన్ని చాటుకున్నారు. కూతురి అవయవాలను దానం చేస్తూ నిర్ణయం తీసుకొని అందరితో శభాష్‌ అనిపించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement