వడదెబ్బతో గుర్తు తెలియనివ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో గుర్తు తెలియనివ్యక్తి మృతి

May 5 2026 6:50 AM | Updated on May 5 2026 6:50 AM

విజయనగర్‌కాలనీ: ఎండ వేడిమికి తాళలేక ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ సఘటన సోమవారం ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గుడిమల్కాపూర్‌ విజయశ్రీ అపార్టుమెంట్‌ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి (50) స్పృహ లేకుండా పడి ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా అప్పటికే అతడు మృతిచెంది ఉన్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. వడదెబ్బతో మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement