గోల్కొండ: మెహిదీపట్నంలోని సరోజీనిదేవి కంటి ఆసుపత్రిలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ఆసుపత్రి గ్రౌండ్ ప్లోర్ లోని సెంట్రల్ మెడిసిన్ స్టోర్ రూమ్‌లో ఈ ప్రమాదం జరిగింది. దీంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలను సిబ్బంది ఆర్పివేశారు. కాగా ఇండోర్ ఏసీ యూనిట్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఓపీ విభాగం, ఎమర్జెన్సీ విభాగంతో పాటు ఇన్‌పేషంట్ విభాగం కూడా ఉండడంతో అక్కడ ఉన్న రోగులు ఔట్‌పేషంట్‌కు వచ్చిన వారు భయంతో పరుగులు తీశారు. రెండు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారని ఏడిఎఫ్‌వో వి.భానుప్రతాప్ తెలిపారు.


