సాక్షి, సిటీబ్యూరో: దేశంలోని ప్రముఖ ట్రావెల్ సంస్థల్లో ఒకటైన సదరన్ ట్రావెల్స్.. వియన్ ఐకానిక్ ట్రావెల్– టూరిజం సమ్మిట్–2026లో ప్రతిష్టాత్మకమైన ‘‘ప్రిఫర్డ్ ఇంటర్నేషనల్ టూర్ ఆపరేటర్’’అవార్డు అందుకుంది. ఈ అవార్డును న్యూఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ డైరెక్టర్ అశ్వినీ లోహాని, టూరిజం–హాస్పిటాలిటీ స్కిల్ కౌన్సిల్ చైర్‌పర్సన్ జ్యోతి మయాల్ ప్రదానం చేశారు. సదరన్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణమోహన్ ఆలపాటి మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం గౌరవంగా ఉందని, ఈ గుర్తింపు వినియోగదారుల నమ్మకానికి, సిబ్బంది అంకితభావానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. 56 ఏళ్లు 2 వేలకుపైగా దేశీయ, అంతర్జాతీయ హాలిడే ప్యాకేజీలు, కార్పొరేట్ ట్రావెల్ సొల్యూషన్లు, కస్టమైజ్డ్ హాలిడే అనుభవాలను అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.


