తండ్రి మందలించాడని.. | - | Sakshi
Sakshi News home page

తండ్రి మందలించాడని..

Mar 7 2024 6:50 AM | Updated on Mar 7 2024 7:50 AM

కృష్ణవేణి(ఫైల్‌) - Sakshi

కృష్ణవేణి(ఫైల్‌)

భవనంపై నుంచి దూకి బాలిక ఆత్మహత్య

నిజాంపేట్‌: చదువుకోవాలని తండ్రి మందలించడంతో మనస్తాపానికి లోనైన ఓ విద్యార్థిని భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే ప్రగతినగర్‌ సాయి కీర్తి లేఅవుట్‌లోని ధర్మపురి దొరవారి అపార్ట్‌మెంట్‌లో ఈస్ట్‌ గోదావరి జిల్లాకు చెందిన బాపిరాజు వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అతడి కుమార్తె కృష్ణవేణి(19) ఇంటర్‌ ఫెయిలైంది. గత రెండేల్లుగా తప్పిపోయిన సబ్జెక్టుల పరీక్షలు రాస్తుంది. ఈ నెల 15, 18 తేదీల్లో పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి బాపిరాజు ఈసారైనా బుద్ధిగా చదువుకుని పాస్‌ కావాలని సూచించాడు. దీంతో మనస్తాపానికి లోనైన కృష్ణవేణి అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement