ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ! | - | Sakshi
Sakshi News home page

Medchal-Malkajgiri: ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ!

Jan 26 2024 6:06 AM | Updated on Jan 26 2024 12:56 PM

- - Sakshi

మేడ్చల్‌ రూరల్‌: ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురికి పిల్లలకు జన్మనిచ్చింది. ఏడో నెలలో పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి వెళ్లిన గర్భిణికి వైద్యులు సాధారణ ప్రసవం చేయగా ఇద్దరు మగ, ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్‌ మండలం రాజబొల్లారం తండాకు చెందిన సులోచన, మెదక్‌ జిల్లా నర్సాపూర్‌కు చెందిన అనిల్‌కుమార్‌ దంపతులు.

వీరు ఇదే జిల్లాలోని కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్నారు. సులోచన 7 నెలల గర్భిణి. గురువారం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఘనాపూర్‌ గ్రామ పరిధిలోని మెడిసిటి ఆస్పత్రిలో చేర్పించారు. గైనకాలజిస్టులు డాక్టర్‌ కల్పన, నిషి వైద్య బృందం సులోచనకు సాధారణ ప్రసవం చేశారు.

మొదట 800, 500 గ్రాముల బరువున్న ఇద్దరు మగపిల్లలు, అయిదు నిమిషాల తర్వాత 600, 900 గ్రాముల బరువులో మరో ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. తల్లీ పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని, పిల్లలు తక్కువ బరువుతో పుట్టడంతో నగరంలోని నిలోఫర్‌ ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement