breaking news
babys
-
ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ!
మేడ్చల్ రూరల్: ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురికి పిల్లలకు జన్మనిచ్చింది. ఏడో నెలలో పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి వెళ్లిన గర్భిణికి వైద్యులు సాధారణ ప్రసవం చేయగా ఇద్దరు మగ, ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలం రాజబొల్లారం తండాకు చెందిన సులోచన, మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన అనిల్‌కుమార్ దంపతులు. వీరు ఇదే జిల్లాలోని కుత్బుల్లాపూర్ డివిజన్ జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్నారు. సులోచన 7 నెలల గర్భిణి. గురువారం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఘనాపూర్ గ్రామ పరిధిలోని మెడిసిటి ఆస్పత్రిలో చేర్పించారు. గైనకాలజిస్టులు డాక్టర్ కల్పన, నిషి వైద్య బృందం సులోచనకు సాధారణ ప్రసవం చేశారు. మొదట 800, 500 గ్రాముల బరువున్న ఇద్దరు మగపిల్లలు, అయిదు నిమిషాల తర్వాత 600, 900 గ్రాముల బరువులో మరో ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. తల్లీ పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని, పిల్లలు తక్కువ బరువుతో పుట్టడంతో నగరంలోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. -
తొలి కాన్పులోనే ముగ్గురు.. అందరూ బంగారుతల్లులే
కొత్తగూడెం రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ మహిళ మొదటి కాన్పులోనే ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. జిల్లాలోని సుజాతనగర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ వీర్ల డాంగీ భార్య లావణ్య శనివారం పురిటి నొప్పులతో కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. లావణ్యకు డాక్టర్ ఐశ్వర్య ఆపరేషన్ చేయగా ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. తల్లి, ముగ్గురు శిశువులు క్షేమంగా ఉన్నారని డాక్టర్ తెలిపారు. ఒకే కాన్పులో ముగ్గురు పుట్టడం అరుదైన ఘటన అని పేర్కొన్నారు. చదవండి: అందరికీ ఉచితంగా టీకా: సీఎం కేసీఆర్ చదవండి: దొరక్క దొరికిన ఆస్పత్రి బెడ్.. అంతలోనే