75 అడుగుల భారీ కండువా | - | Sakshi
Sakshi News home page

75 అడుగుల భారీ కండువా

Sep 17 2023 6:36 AM | Updated on Sep 17 2023 7:06 AM

- - Sakshi

ఖైరతాబాద్‌: మహాగణపతికి భారీ కండువా, జంధ్యం, గరిక మాలతో పాటు దేవతామూర్తులకు సమర్పించే పట్టు వస్త్రాలకు ఖైరతాబాద్‌ పద్మశాలి సంఘం సభ్యులు శనివారం పూజలు నిర్వహించారు. శ్రీ దశమహా విద్యా గణపతిగా కొలువుదీరిన మహాగణపతికి సోమవారం వినాయక చవితి రోజున ఉదయం 7 గంటలకు 75 అడుగుల కండువా, జంధ్యం, గరికమాలను సమర్పిస్తున్నట్లు అధ్యక్షుడు కడారి శ్రీధర్‌, గౌరవ అధ్యక్షుడు గుర్రం కొండయ్య తెలిపారు. మహాగణపతికి ఇరువైపులా కొలువుదీరిన వీరభద్ర స్వామి, నరసింహస్వామి, సరస్వతిదేవి, వారాహి దేవతామూర్తులకు పట్టు వస్త్రాలను అందజేయనున్నట్లు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement