ప్రేయసిని దూరం చేశాడనే.. | - | Sakshi
Sakshi News home page

ప్రేయసిని దూరం చేశాడనే..

Sep 4 2023 6:12 AM | Updated on Sep 4 2023 7:30 AM

- - Sakshi

నిందితులు సంజీవ్‌, ధన్‌కుమార్‌ బారం, మహేశ్వర్‌

హైదరాబాద్: తన ప్రేయసిని దూరం చేయడమే కాకుండా మరొకరికి ఇచ్చి పెళ్లి చేశాడని కక్ష పెంచుకున్న ఓ యువకుడు తన అనుచరులతో కలిసి ఓ యువకుడిపై కత్తులతో దాడి చేసిన ఘటనలో జూబ్లీహిల్స్‌ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ శ్రీరాం గోపి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన జబాన్‌ రాహుల్‌ వెంకటగిరిలో నివాసం ఉంటూ సమీపంలోని సాంక్చువరీ బార్‌ అండ్‌ కిచెన్‌లో చెఫ్‌గా పని చేస్తున్నాడు.

ఏడాది క్రితం అదే ప్రాంతానికి చెందిన రేఖారాణి అనే యువతి అదే ప్రాంతంలో అద్దెకు ఉంటున్న సంజీవ్‌ అనే యువకుడిని ప్రేమించింది. అయితే వారి మధ్య విభేదాలు రావడంతో ఆమె కేశవ్‌ అనే మరో యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఒడిశాకు వెళ్లి పోయింది. వీరి పెళ్లికి రాహుల్‌ సహకారం అందించాడు. అప్పటి నుంచే రాహుల్‌పై కక్ష పెంచుకున్న సంజీవ్‌ అతడిపై దాడికి పథకం వేశాడు.

నాలుగు రోజుల క్రితం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న రాహుల్‌ను సంజీవ్‌తో పాటు అతడి అనుచరులు ధన్‌కుమార్‌ బారం, మహేశ్వర్‌ అడ్డగించి కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. వీరి సెల్‌ఫోన్‌ నెంబర్ల ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement