గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న
వరంగల్ అర్బన్: కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యలు పరిష్కరించాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో ఈ–వార్డు, పెన్షన్ , పబ్లిక్ హెల్త్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ తదితర విభాగాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా విభాగాల్లో రికార్డుల నిర్వహణ, ఫైళ్ల స్థితిగతులు, పెండింగ్ దరఖాస్తులు, కార్యాలయ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ పార్కును సందర్శించారు. ఈ నెల 6న ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం 54వ డివిజన్ పోచమ్మకుంటలోని వైకుంఠధామం, 57వ డివిజన్ టీవీ టవర్ ప్రాంతంలోని వైకుంఠధామాన్ని సందర్శించారు. తర్వాత గ్రేటర్ ప్రధాన కార్యాలయ ఆవరణలోని ప్రతాపరుద్ర ప్లానిటోరియం పునరుద్ధరణ పనులు పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని అధిదకారులకు సూచించారు. ఆయన వెంట సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్, అసిస్టెంట్ ఇంజనీర్ హరి ఉన్నారు.
ప్రతి ఇంటికి ఆస్తి పన్ను అసెస్‌మెంట్ ఉండాలి
ప్రతి ఇంటికి ఆస్తి పన్ను అసెస్‌మెంట్ ఉండాలని కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. గ్రేటర్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో కమిషనర్ మాట్లాడారు. అదనపు కమిషనర్ జోనా, ఉప కమిషనర్లు ప్రసన్నరాణి, బిర్రు శ్రీనివాస్, టీఓ రామకృష్ణ, పాల్గొన్నారు.


