పలువురు కార్యకర్తల అరెస్ట్.. విడుదల
కాజీపేట: కాజీపేట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల జాప్యంపై బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్‌రెడ్డి, పార్టీ నాయకురాలు రావు పద్మారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కాజీపేట బ్రిడ్జిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడారం జాతరలోపే బ్రిడ్జి పూర్తి చేస్తామని ఎమ్మెల్యే ప్రకటించినా పనులు జరగకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతుందని విమర్శించారు. బ్రిడ్జిపై ధర్నాతో గంటసేపటికి పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావు, నాయకులు కాళీప్రసాద్‌రావు, పులి సరోత్తంరెడ్డి, కొత్త రవి, కాయిత రాజ్‌కుమార్ యాదవ్, మేకల శ్రావణ్‌కుమార్ యాదవ్, గుజ్జుల వసంత పాల్గొన్నారు.


