● కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి
కేయూ క్యాంపస్ : డ్రగ్ ఫ్రీ క్యాంపస్ లక్ష్యంగా కార్యాచరణ చేపడుతున్నామని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర విశ్వవిద్యాలయాల వీసీ, తదితరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీ పరిధిలోని ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వివిధ కోర్సుల్లో 1.50లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. కేయూ పరిధిలో కళాశాలల్లోని 356 ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లు ఉండగా 35,600 మంది వలంటీర్లు ఉన్నారని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై సీనియర్ అధ్యాపకుల, పోలీస్ శాఖ, స్వచ్ఛంద సంస్థల సహకారంతో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలి పారు. ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లతోపాటుఇతర విద్యార్థులను కూడా ‘మై భారత్ ’పోర్టల్‌లో నమోదు చే సుకునేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. కాగా, లోక్‌భవనలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మై భారత్’ పోర్టల్‌లో విద్యార్థుల నమోదు, యూత్ రెడ్‌క్రాస్ ఏర్పాటు, నషా ముక్త్ భారత్ అభియాన్ అమలులో విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంపై జరిగిన చర్చలో ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.


