‘గ్రేటర్‌’కు మరో 100 విద్యుత్‌ బస్సులు | - | Sakshi
Sakshi News home page

‘గ్రేటర్‌’కు మరో 100 విద్యుత్‌ బస్సులు

Aug 5 2026 8:45 AM | Updated on Aug 5 2026 8:45 AM

‘గ్రేటర్‌’కు మరో 100 విద్యుత్‌ బస్సులు

ఏమనుకుంటున్నావు.. సస్పెండ్‌ చేస్తా

– 8లోu

ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

హన్మకొండ: గ్రేటర్‌ వరంగల్‌ పరిధికి పీఎం ఈ–బస్‌ సేవలో భాగంగా 100 విద్యుత్‌ బస్సులు రానున్నాయని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. వరంగల్‌ రీజియన్‌ తనిఖీల్లో భాగంగా మంగళవారం ఆయన నగర పరిధిలోని వివిధ డిపోలను పరిశీలించారు. అనంతరం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కొత్త బస్సులను హనుమకొండ డిపోతో పాటు ఆర్టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీలో నూతనంగా నిర్మించనున్న డిపోకు కేటాయించనున్నట్లు వివరించారు. 100 బస్సులు ఒకే డిపో ద్వారా నడపడం సాధ్యం కాదని, రెండు డిపోల్లో చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుతోపాటు ఈ మేరకు అభివృద్ధి చేస్తామన్నారు. ఎయిర్‌పోర్టు సమీపంలో ఆర్టీసీకి స్థలం లేదని, మున్సిపల్‌ కార్పొరేషన్‌, ప్రభుత్వం లేదా ఎయిర్‌పోర్టు అథారిటీ వారు కేటాయిస్తే పరిశీలిస్తామన్నారు. హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్‌ నిర్మాణ సమయంలో ఎత్తు పెంచితే బాగుండేదన్నారు. వరద నీటి నిలువ సమస్యను పరిష్కరిస్తామన్నారు. దీనికి ప్రతిపాదనలు రూపొందించామని, టెండర్లు పూర్తయ్యాయన్నా రు. మొత్తానికి ఖర్చు తగ్గించుకుని, ఆదాయం పెంచుకునేలా అధికారులకు దిశానిర్దేశం చేశామన్నారు.

ఫైళ్ల మాయంపై ఆరా..

ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌లో ఫైళ్లు మాయంపై ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి స్పందించారు. మంగళవారం ఆర్‌ఎం కార్యాలయంలో ఆర్టీసీ హైర్‌ బస్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అద్దె బస్సుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాక్షిలో ప్రచురితమైన ‘ఫైళ్ల మాయం’ కథనంపై అద్దె బస్సుల యజమానులతో చర్చించారు. ఫైల్‌ మాయవడమేమిటని ఆర్‌ఎం భవానిప్రసాద్‌ను ప్రశ్నించి, అది ఏం ఫైల్‌ అని తెలుసుకున్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఆర్‌ఎంను ఆదేశించినట్లు సమాచారం. అద్దె బస్‌ల రిప్లేస్‌మెంట్‌ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనుమతి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారని అద్దె బస్సుల యజమానులు తెలిపారు. సమావేశంలో బాధ్యులు లక్కం ప్రభాకర్‌, మారిపల్లి రాంరెడ్డి, హబీబుద్దీన్‌, సదానందం, కె.భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

హనుమకొండ బస్‌స్టేషన్‌లో నీటిగుంతలను పరిశీలిస్తున్న ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

అసంపూర్తి సమాచారంపై ఆర్‌ఎంపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఆగ్రహం

వరంగల్‌ బస్‌స్టేషన్‌ పనుల తనిఖీ, హనుమకొండ బస్‌స్టేషన్‌,

డిపోల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement