న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 2026
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్, అమృత్ భారత్ స్టేషన్ ప్రారంభోత్సవానికి రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 1904లో నిజాం రైల్వే లిమిడెట్ కంపెనీ కాలంలో కాజీపేట రైల్వే స్టేషన్ ఏర్పాటైంది. దినాదినాభివృద్ధి చెందుతూ 1923లో కాజీపేట జంక్షన్‌గా అప్‌గ్రేడ్ అయ్యి నేడు ఉత్తర, దక్షిణ దేశ ప్రాంతాలకు గేట్‌వేగా మారింది. కాజీపేటను మారుతున్న సాంకేతిక రంగానికి అనుగుణంగా మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర పథకం అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద ప్రధాని నరేంద్రమోదీ 2024లో కాజీపేట జంక్షన్‌ను ఈ స్కీంకు ఎంపిక చేసి నిధులు మంజూరు చేశారు. ఈ స్కీం కింద రైల్వేశాఖ కాజీపేట జంక్షన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో రీ డెవలప్‌మెంట్‌కు శ్రీకారం చుట్టారు. దాదాపు రెండేళ్లుగా కాజీపేట అమృత్ భారత్ స్టేషన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ఈ పనులు పూర్తి కానున్నాయి. ఈనెల 15న లేదా నెలాఖరున ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు రైల్వే శాఖ సర్వం సిద్ధం చేస్తున్నట్లు సంబంధిత అఽధికారులు చెబుతున్నారు.
కొనసాగుతున్న పనులివే..
కాజీపేట జంక్షన్ భవనం వరల్డ్‌క్లాస్ హైటెక్ హంగులతో రీమోడలింగ్, ఫోర్టికో, ప్రయాణికులు వేచి ఉండేందుకు గజిబో, ఇంటర్నల్ ఫాత్‌వేస్, ప్లాట్‌ఫాం షెడ్స్, ప్లాట్‌పాం ఫ్లోరింగ్, 12 మీటర్ల వైడ్ న్యూ ఫుట్ ఓవర్ బ్రిడ్జికి ర్యాంప్, ఇన్, ఔట్ ఎస్కలేటర్లు, లిఫ్టులు, కనెక్షన్, ప్రయాణికులకు జనరల్ వెయిటింగ్ హాల్, ఏసీ వెయింటింగ్ హాల్, బేబీ ఫీడింగ్ రూం, జనరల్ టాయిలెట్స్, దివ్యాంగుల టాయిలెట్స్ వాటర్ సదుపాయం, పాత్ వేస్, లేడీస్ టాయిలెట్స్, స్టేషన్ ఎల్వెషన్ (ఫాసాడ్), వాటర్ ట్యాంక్ నిర్మాణం, స్టేషన్ ఎదుట కార్ పార్కింగ్, వాహనాల పార్కింగ్, గ్రీనరీ, గార్డెన్, సీసీ రోడ్ల నిర్మాణం, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు.
వరల్డ్ క్లాస్ స్టేషన్‌గా అప్‌గ్రేడ్
ఈనెలలో ప్రధానితో
ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు


