లక్ష్మీపురం: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కోరుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్) గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం వినూత్న నిరసన తెలిపారు. గుంటూరు నగరంలోని కొత్తపేట భగత్ సింగ్‌బొమ్మ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నారా లోకేష్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యా రంగ సమస్యల నిలయంగా మారిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందని విమర్శించారు. రాష్ట్రంలో రూ.6,400 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉండిపోవడం వలన దిక్కుతోచని స్థితిలో విద్యార్థులను నెట్టివేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పోరాటాల ద్వారా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల కాకపోవడం కారణంగా అనేకమంది విద్యార్థులకు విద్యార్థులకు కళాశాల యాజమాన్యాలు చదువు పూర్తయిన సర్టిఫికెట్లను ఇవ్వటం లేదని వాపోయారు. ఇప్పటికై నా నారా లోకేష్ స్పందించి విద్యార్థులకు న్యాయం చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఫీజు పోరు రాటాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి యశ్వంత్ మాట్లాడుతూ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పీజీ చదువుకునే కలలు కొంటున్న విద్యార్థులకు జీవో నంబర్ 77 నష్టంగా మారిందని చెప్పారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నగర నాయకులు సాయి గణేష్, మహేష్, కిరణ్, ప్రత్తిపాడు నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు డేవిడ్, అమర్నాథ్ పాల్గొన్నారు.
వినూత్న కార్యక్రమం


