రాజధానిలో ఐస్‌లాండ్‌ ప్రతినిధి బృందం పర్యటన | - | Sakshi
Sakshi News home page

రాజధానిలో ఐస్‌లాండ్‌ ప్రతినిధి బృందం పర్యటన

Nov 21 2026 2:26 AM | Updated on Nov 21 2026 2:26 AM

తాడికొండ: రాజధాని నిర్మాణం, నగర ప్రణాళిక, ఆధునిక ఆర్కిటెక్చర్‌, సుస్థిర పట్టణాభివృద్ధిపై అవగాహన పెంచుకునేందుకు ఐస్‌లాండ్‌కు చెందిన ప్రతినిధి బృందం శుక్రవారం రాజధానిలో పర్యటించింది. ఏపీ సీఆర్డీయే ప్రధాన కార్యాలయానికి విచ్చేసిన ఈ బృందానికి చీఫ్‌ ఆర్కిటెక్ట్‌ సందీప్‌ దీక్షిత్‌, సీనియర్‌ ఆర్కిటెక్ట్‌లు ప్రసున్న, సుమిత్ర స్వాగతం పలికారు. అనంతరం ఏపీ సీఆర్డీయే అదనపు కమిషనర్‌, ఏజీఐసీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌లు అమరావతి నిర్మాణ ప్రణాళికపై సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలోని అమరావతి ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ప్రజెంటేషన్‌ ఇచ్చారు. రాజధానిగా అమరావతి లక్ష్యాలు, బ్లూ–గ్రీన్‌ మాస్టర్‌ ప్లాన్‌, నగర నిర్మాణ రూపకల్పన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వంటి అంశాలను వివరించారు. భారీ మౌలిక వసతుల ప్రాజెక్టుల అమలు, సుస్థిర పట్టణాభివృద్ధి, భవిష్యత్తులో సహకార అవకాశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మత్స్యశాఖ కమిషనర్‌ రమా శంకర్‌ నాయక్‌(రిటైర్డ్‌ ఐఏఎస్‌) పాల్గొన్నారు. ఐస్‌ల్యాండ్‌ ప్రతినిధి బృందంలో నార్డిక్‌ ఆర్కిటెక్చర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఎంఎస్‌ హాల్డన్‌ విఫిల్స్‌ డాయర్‌, ఐస్‌ల్యాండ్‌ ఓసియన్‌ క్లస్టర్‌ ఫౌండర్‌– ఛైర్మన్‌ డాక్టర్‌ థోర్‌ సిగ్ఫసన్‌ పలువురు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement