ఇద్దరు పారిశ్రామిక వేత్తలకు రూ.6.70 కోట్ల రుణం | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు పారిశ్రామిక వేత్తలకు రూ.6.70 కోట్ల రుణం

Nov 21 2026 2:32 AM | Updated on Nov 21 2026 2:32 AM

నరసరావుపేట: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ) అభివృద్ధికి ప్రోత్సాహంలో భాగంగా ఇద్దరికి రూ.6.70 కోట్ల రుణం అందజేసినట్లు సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (సీబీఐ) రీజినల్‌ హెడ్‌ జీవీ రమణ పేర్కొన్నారు. నూతన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే లక్ష్యంగా బ్యాంకు కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేక ఎంఎస్‌ఎంఈ క్రెడిట్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్‌ శంకరరావుకు రూ.4 కోట్ల రుణం, గుంటు త్రివేణికి రూ.2.70 కోట్ల రుణాన్ని మంజూరు చేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్‌ వీరశంకరరావు రుణ గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు. రమణ మాట్లాడుతూ చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఆర్థిక చేయూత అందించడం ద్వారా స్థానికంగా వ్యాపార అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు బ్యాంకు కృషి చేస్తోందన్నారు. ఎంఎస్‌ఎంఈ రంగంలోని పారిశ్రామికవేత్తలు బ్యాంకు అందిస్తున్న వివిధ రుణ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని తమ వ్యాపారాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement