కామాంధుల కన్ను | - | Sakshi
Sakshi News home page

కామాంధుల కన్ను

Nov 21 2026 2:20 AM | Updated on Nov 21 2026 2:20 AM

శనివారం శ్రీ 21 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 కామాంధుల కన్ను

న్యూస్‌రీల్‌

నూతక్కిలో పోలీసు కవాతు

నిమ్మకాయల ధరలు

వైభవంగా లక్ష దీపోత్సవం

తెనాలి: గుంటూరు జిల్లాలో ఇటీవల బాలికలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. కామాంధులు మాయమాటలతో మభ్యపెట్టి దారుణాలకు పాల్పడుతున్నారు. ఆడుకునే వయసులోనే వారిని అమ్మలు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల పరిచయాలూ పెడదారులు పట్టిస్తున్నాయి. చివరకు పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పాఠాలు బోధించాల్సిన ఓ ఉపాధ్యాయుడు కూడా నిందితుల జాబితాలో ఉండటం సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. ప్రేమ మైకంలో గడప దాటుతున్న ఘటనలూ లేకపోలేదు.

ఇటీవల ఘటనలు ఇవీ...

పట్టణానికి చెందిన ఓ బాలిక పదో తరగతి చదివే సమయంలో ట్యూటర్‌ ఒకరు లైంగికంగా వేధించాడు. ఇప్పుడు ఆ బాలిక ఇంటర్‌లో ఉంది. అదే ట్యూటర్‌ ఇప్పుడు బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీనిపై త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కిడ్నాప్‌, పోక్సో, లైంగికదాడి కేసు నమోదైంది.

తెనాలిలో ఓ విద్యాసంస్థలో ఇంటర్‌ (నర్సింగ్‌) చేస్తున్న 16 ఏళ్ల విద్యార్థిని ఈ నెల 4న తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో బాబుకు జన్మనిచ్చింది. వేమూరు నియోజకవర్గానికి చెందిన ఆ బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు గత ఫిబ్రవరిలో లైంగికదాడి చేశాడు. పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి, అదే అలవాటుగా చేసుకున్నాడు. బాలిక శారీరక మార్పులు గమనించిన తల్లిదండ్రులు ప్రశ్నించటంతో విషయం బయటకొచ్చింది. గ్రామపెద్దల పంచాయితీలో పెళ్లి చేసుకుంటానని అంగీకరించిన యువకుడు.. బిడ్డ పుట్టాక ససేమిరా అన్నాడు. విషయం పోలీస్‌స్టేషనుకు చేరింది. కేసు నమోదు చేసిన కొల్లూరు పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు.

చెంచుపేటకు చెందిన 16 ఏళ్ల బాలిక గత జులై 19వ తేదీన అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. అదే ప్రాంతానికి చెందిన యువకుడు తీసుకెళ్లినట్టు గుర్తించారు. పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. మరో కేసులో పట్టణానికి చెందిన ఇద్దరు మైనర్లకు ఇన్‌స్ట్రాగామ్‌తో పరిచయమైంది. ప్రేమ ఊసులు చెప్పారు. తల్లిదండ్రులు గమనించి, బాలుడితో మాట్లాడకుండా కట్టడి చేశారు. ఇందుకు కక్షగట్టిన ఆ బాలుడు నేరుగా ఆమె ఇంటికి వెళ్లి, కుటుంబసభ్యులపై దాడి చేశాడు. ఈ దారుణంపైనా వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషనులో కేసు నమోదు చేశారు.

పట్టణ నాజరుపేటకు చెందిన ఓ బాలికకు ఇన్‌స్ట్రాగామ్‌లో వేరే ప్రాంతానికి చెందిన యువకుడు పరిచయమయ్యాడు. బాలికను కలిసేందుకంటూ తెనాలి వచ్చిన అతడు, ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

స్థానిక చెంచుపేటలోని ఓ కార్పొరేట్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి బాలికతో అక్కడే రిసెప్షనులో పనిచేసే యువకుడు మాయమాటలతో పరిచయం పెంచుకున్నాడు. తర్వాత లైంగిక దాడి చేశాడు. ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైన గుంటూరుకు చెందిన యువకుడు, అదే బాలికను విశాఖపట్నం తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై పోలీసు కేసు నమోదైంది.

బతుకుదెరువు కోసం తెలంగాణ నుంచి వలస వచ్చిన కుటుంబంలోని 14 ఏళ్ల బాలిక తాడేపల్లిలో ఓ వస్త్రదుకాణంలో పనిచేస్తోంది. కోదాడకు చెందిన యువకుడు ఆశిక్‌ మాయమాటలతో లైంగిక దాడి చేశాడు. గర్భం దాల్చిన బాలికను ప్రశ్నించటంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిలదీసిన తల్లిదండ్రులనూ అతడు దూషించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.

గురువు స్థానంలో ఉండి కూడా....

ఉపాధ్యాయుడే తమతో అసభ్యంగా ప్రవర్తించాడని పెదరావూరు హైస్కూలు బాలికలు ఆవేదన చెందారు. ఇళ్లకు వెళ్లి పెద్దలకు చెప్పారు. తల్లిదండ్రులు గురువారం హైస్కూలుకు వచ్చి, ఆ ఉపాధ్యాయుడిని తమకు అప్పగించాలని పట్టుబట్టారు. వెంటనే అక్కడకు వెళ్లిన ఎంఈవో... విద్యార్థినుల నుంచి వివరాలను తీసుకున్నారు. నివేదిక పంపటంతో జిల్లా విద్యాశాఖ అధికారులు సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.

అఘాయిత్యాలతోపాటు ఈవ్‌టీజింగ్‌ మరో బెడదగా మారింది. స్థానిక కొత్తపేటలోని బాలికల హైస్కూలు విద్యార్థిని టీజ్‌ చేస్తున్న యువకుడిని పట్టుకునేందుకు వన్‌టౌన్‌ సీఐ, మండల తహసీల్దారు కాపు కాశారు. తీరా దగ్గరకు వచ్చిన తర్వాత గుర్తించిన ఈవ్‌టీజర్‌ స్కూటర్‌పై శరవేగంగా జారుకున్నాడు. పట్టణానికి చెందిన హైస్కూలు విద్యార్థిని ప్రతిరోజు సాయంత్రం డాన్స్‌ క్లాస్‌కు వెళ్లేది. ఓ బాలుడు మరో విద్యార్థితో కలిసి ఆమె వెంట పడుతున్నాడు. ఈ క్రమంలో బోసు రోడ్డులోంచి శాలిపేటకు వెళ్లే ఓ ఇరుకు సందులో ఇంటికి వెళుతున్న బాలికతో ఆ బాలుడు అసభ్యంగా ప్రవర్తించాడు. బెంబేలెత్తిన బాలిక సైకిల్‌ వదిలేసి పరుగెత్తుకుంటూ ఇంటికి వెళ్లింది. పెద్దలకు చెప్పుకొని విలపించింది.

గుంటూరు
శనివారం శ్రీ 21 శ్రీ నవంబర్‌ శ్రీ 2026
బాలికలపై

7

జెడ్పీ చైర్‌పర్సన్‌ దారా అరుణకు పుష్పగుచ్ఛం

అందిస్తున్న జిల్లా కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ

మంగళగిరి రూరల్‌: మంగళగిరి మండలం నూతక్కి గ్రామంలో శుక్రవారం పోలీసులు కవాతు నిర్వహించారు. మంగళగిరి డీఎస్పీ కే వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

తెనాలి: స్థానిక మార్కెట్‌యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ.1,200, గరిష్ఠ ధర రూ.2,700, మోడల్‌ ధర రూ.2 వేల వరకు పలికింది.

కొల్లూరు: స్థానిక అనంత భోగేశ్వర ఆలయంలో శుక్రవారం లక్ష దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

మైనర్లపై కామాంధుల కన్ను పడటంతో వారి బంగారు భవిష్యత్తు అంధకారం అవుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇటీవల ఈ తరహా దారుణాలు పెరుగుతున్నాయి. తెలిసీ తెలియని వయస్సులో కామాంధులు చెప్పే మాయమాటలకు బాలికలు బలవుతున్నారు.

మైనర్‌లపై పెరిగిన లైంగిక దాడులు

మాయమాటలతో మభ్యపెట్టి దారుణం

ఆందోళన కలిగిస్తున్న అఘాయిత్యాలు

చాలాచోట్ల ఈవ్‌టీజింగ్‌తో

బాలికలు బెంబేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement