ఇది సాధారణ బొమ్మ కాదు.. మినీ రోబో స్నేహితుడు! | AIPI Lite AI Robot Built With New Technology | Sakshi
Sakshi News home page

ఇది సాధారణ బొమ్మ కాదు.. మినీ రోబో స్నేహితుడు!

Jun 21 2026 12:34 PM | Updated on Jun 21 2026 12:34 PM

AIPI Lite AI Robot Built With New Technology

ఫండే

ఏఐ

మీ మాటలు వినే, మీతో సరదాగా కబుర్లు చెప్పే ఓ చిన్న స్నేహితుడు ఉంటే బాగుండేదనిపిస్తోందా? అయితే ‘ఏఐపీఐ–లైట్‌ ఏఐ రోబో’ మీకోసమే!

ఇది సాధారణ బొమ్మ కాదు. కృత్రిమ మేధస్సుతో పనిచేసే స్మార్ట్‌ రోబో! ఈ చిన్న రోబోతో మాట్లాడితే సహజంగా స్పందిస్తుంది. ప్రశ్నలకు జవాబులు చెప్పడమే కాదు, మీతో సరదాగా చాట్‌ చేస్తూ స్నేహితుడిలా మెలుగుతుంది.

వాయిస్‌ క్లోనింగ్‌ సదుపాయంతో మీకు నచ్చిన స్వరాన్ని ఎంచుకోవచ్చు. అంతేకాదు, మీతో జరిగిన సంభాషణలను గుర్తుంచుకునే మెమరీ ఫీచర్‌ కూడా ఉంది. రియల్‌టైమ్‌లో స్పందిస్తూ నవ్వులు, సరదా వ్యాఖ్యలతో సంభాషణను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. డెస్క్‌పై అందంగా పెట్టుకునే ఈ స్మార్ట్‌ రోబో ధర సుమారు రూ. 4,500.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement