చింతలపూడిలో వైఎస్సార్‌సీపీ దూకుడు | - | Sakshi
Sakshi News home page

చింతలపూడిలో వైఎస్సార్‌సీపీ దూకుడు

Nov 21 2026 12:26 AM | Updated on Nov 21 2026 12:26 AM

చింతలపూడి: చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పట్టణంలో విస్తతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం పార్టీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి పెదగర్ల సునీత 23వ వార్డులో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా స్థానిక మహిళలు, ప్రజలు ఆమెకు హారతులు పట్టి స్వాగతం పలికారు. నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు నాయకత్వంలో కౌన్సిలర్‌ అభ్యర్థులు ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారని, నగర పంచాయతీలోని 23 వార్డు కౌన్సిలర్‌ స్థానాలను తామే గెలుచుకుంటామని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం 13వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి డి. రామరాజు నాయక్‌ ఎన్‌వీఎన్‌ కాలనీలో పర్యటించి ప్రచారం నిర్వహించారు. అలాగే 17వ వార్డు ఎస్టీ అభ్యర్థి జగన్నాథం రమాదేవి సైతం తన వార్డులో ఇంటింటి ప్రచారం చేపట్టారు. స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జోరుగా ఎన్నికల ప్రచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement