ఉత్సాహంగా యువజనోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా యువజనోత్సవం

Nov 22 2026 2:29 AM | Updated on Nov 22 2026 2:29 AM

ఉత్సాహంగా యువజనోత్సవం ఏకగ్రీవానికి మహిళా అభ్యర్థి బ్రేక్‌ ! రేపు మేయర్‌, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం నామినల్‌ రోల్‌ సమర్పణకు గడువు పెంచాలి బియ్యం నిల్వల నియంత్రణకు చర్యలు ముగిసిన నామినేషన్ల పరిశీలన

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక సెయింట్‌ థెరిస్సా మహిళా కళాశాలలో శనివారం జిల్లాస్థాయి యువజనోత్సవం–2026ను నిర్వహించారు. సుమారు 400 మంది యువతీయువకులు పలు పోటీల్లో ప్రతిభ చాటారని సెట్‌వెల్‌ సీఈఓకేఎస్‌ ప్రభాకర్‌రావు తెలిపారు. విద్యతో పాటు సృజనాత్మకత, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ రాణించాలని సూచించారు. జిల్లా గ్రా మీణ అభివృద్ధి సంస్థ పీడీ టీవీవీ విజయలక్ష్మి, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్‌ఏ అజీజ్‌, సెయింట్‌ థెరిస్సా మహిళా కళాశాల ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్‌ సీఏ జ్యోతిర్మయి, పర్యాటక శాఖ మేనేజర్‌ ఎస్‌.పట్టాభి రామన్న, సెట్‌వెల్‌ అకౌంటెంట్‌ పి.ప్రసాదరావు పాల్గొన్నారు.

కుక్కునూరు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స ర్పంచ్‌ పదవిని ఏకగ్రీవం చేసుకోవాలన్న కొందరు నాయకుల ప్రయత్నాలకు ఓ సామాన్య మహిళ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసి అడ్డుకట్ట వేసింది. కుక్కునూరుకు చెందిన బుయ్యన నాంచారి గ్రామ సర్పంచ్‌గా నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ ఉపసంహరించుకునేలా పలువురు నాయకులు ఆమె ను ఒప్పించేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. వారి ప్రయత్నాలకు అందుబాటులో లేకుండా వెళ్లిపోవడంతో ఏకగ్రీవంపై ఆశలు పెట్టుకున్న నాయకులకు నిరాశ ఎదురైంది. దీంతో కుక్కునూరు సర్పంచ్‌ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. ఓ సామాన్య మహిళ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముందుకు రావడం ప్రశంసనీయమని గ్రామస్తులు అంటున్నారు. ఈ వ్యవహారం కుక్కునూరులో చర్చనీయాంశంగా మారింది.

ఏలూరు (టూటౌన్‌): ఏలూరు నగర పాలక సంస్థలో సోమారం మేయర్‌, 62 మంది డివిజన్‌ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్య క్రమంతో పాటు డిప్యూటీ మేయర్‌ ఎన్నిక నిర్వహించనున్నట్టు నగరపాలక సంస్థ కమిషనర్‌ కె.భానుప్రకాష్‌ తెలిపారు. ఉదయం 11 గంటలకు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నెల రోజులుగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో ఉండటంతో పదో తరగతి విద్యార్థుల నామినల్‌ రోల్‌ తయారీకి గడువు పెంచాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు కోరారు. అలాగే యూడైస్‌ ప్లస్‌లో విద్యార్థుల వివరాల్లోని పొరపాట్లను సరిదిద్దడానికి ఎడిట్‌ ఆప్షన్‌ను ప్రధానోపాధ్యాయుల లాగిన్‌లో ఇవ్వాలని కోరారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): బియ్యం ధరలను అదుపులో ఉంచేలా నిల్వల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్టు జేసీ ఎంజే అభిషేక్‌ గౌడ తెలిపారు. ధాన్యం, బియ్యం వర్తకులు, రైస్‌ మిల్లర్లు, ప్రాసెసర్లు, హోల్‌సేలర్లు, ట్రేడర్లు, రిటైలర్లు, బిగ్‌ చైన్‌ రిటైలర్లు జిల్లా పౌర సరఫరాల అధికారి వద్ద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిల్వల పరిమితులు, బియ్యం ధరలను వెల్లడించారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగనున్న 8 మండలాల్లో నామినేషన్ల పరిశీలన శనివారం ముగిసింది. 194 సర్పంచ్‌ స్థానాలకు 999, 1972 వార్డు సభ్యులకు 4,515 నామినేషన్లు చెల్లబాటు అయ్యాయని అధికారులు తెలిపారు. మండలాల వారీగా ద్వారకాతిరుమలలో 28 సర్పంచ్‌ స్థానాలకు 158 మంది, 294 వార్డు సభ్యుల స్థానాలకు 847 మంది, కై కలూరులో 26 సర్పంచ్‌ స్థానాలకు 139 మంది, 268 వార్డు సభ్యుల స్థానాలకు 534 మంది, కలిదిండిలో 23 సర్పంచ్‌ స్థానాలకు 134 మంది, 244 వార్డు సభ్యుల స్థానాలకు 543 మంది, మండవల్లిలో 29 సర్పంచ్‌ స్థానాలకు 133 మంది, 266 వార్డు సభ్యుల స్థానాలకు 489, ముదినేపల్లిలో 32 సర్పంచ్‌ స్థానాలకు 153 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 627 మంది బరిలో ఉన్నారు. అలాగే భీమడోలు మండలంలో 13 సర్పంచ్‌ స్థానాలకు 82 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 391 మంది, నిడమర్రులో 16 సర్పంచ్‌ స్థానాలకు 61 మంది, 168 వార్డు సభ్యుల స్థానాలకు 437 మంది, ఉంగుటూరులో 27 సర్పంచ్‌ స్థానాలకు 139 మంది, 278 వార్డు సభ్యుల స్థానాలకు 647 మంది పోటీలో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement