తెప్పోత్సవం.. తేజోమయం | - | Sakshi
Sakshi News home page

తెప్పోత్సవం.. తేజోమయం

Nov 22 2026 2:29 AM | Updated on Nov 22 2026 2:29 AM

తెప్పోత్సవం.. తేజోమయం

నాడు అండగా జగన్‌ సర్కారు

వరుస తుపాన్లతో జిల్లాలో పంట నష్టం

స్వామి, అమ్మవార్లకు హారతులిస్తున్న అర్చకులు

పుష్కరిణిలో కార్తీక దీపాలు వదులుతున్న భక్తులు

అందని సాయం..

అన్నదాత ఆర్తనాదం

సాక్షి, భీమవరం: వరుస తుపాన్లు తొలకరి పంటను ముంచేసి నాలుగు వారాలవుతోంది. జిల్లాలోని 72,970 హెక్టార్లలో రూ.586 కోట్లు పంట నష్టం వాటిల్లినట్టు వ్యవసాయశాఖ నివేదిక ఇచ్చి పది రోజులయ్యింది. రైతులకు పెట్టుబడి సాయంగా రూ.182.42 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ, అలాగే పంటల బీమా పరిహారం విడుదలపై చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఎప్పుడు ఇచ్చేది చెప్పడం లేదు.

జిల్లాలోని 87 వేల హెక్టార్ల ఖరీఫ్‌ ఆయకట్టుకు సాగుచివరిలో వచ్చిన అర్నబ్‌, మురసు తుపాన్లు కర్షకులను కోలుకోలేని దెబ్బతీశాయి. గత నెల 28 అర్నబ్‌, ఈనెల 2న మురసు తుపాన్లు ధాటికి 72,970 హెక్టార్లలోని పంట వారాల తరబడి నీట మునిగి అపార నష్టం వాటిల్లింది. వ్యవసాయశాఖ క్షేత్రస్థాయిలో సర్వే చేసి పంట నష్టంపై ఈనెల 12న ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. జిల్లాలోని 1,08,406 మంది రైతులకు చెందిన 72,970 హెక్టార్లలోని వరి పంటకు 33 శాతానికి పైబడి నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు. రూ.535.87 కోట్ల విలువైన 2.19 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి తగ్గనున్నట్టు లెక్కలు తేల్చారు. తాడేపల్లిగూడెం రూరల్‌, పెంటపాడు, ఇరగవరం, అత్తిలి, తణుకు రూరల్‌, పోడూరు, వీరవాసరం మండలాల్లో పంటనష్టం ఎక్కువగా ఉంది. హెక్టారుకు రూ.25 వేల చొప్పున రూ.182.42 కోట్ల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీగా అందజేయాల్సి ఉందని ప్రభుత్వానికి సూచించారు. మరోపక్క 34,143 హెక్టార్లకు 64,109 మంది రైతులు క్రాఫ్‌ ఇన్సూరెన్స్‌ చేయించుకోగా పంటల బీమా పరిహారం విడుదల కావాల్సి ఉంది.

సాయం మాటలకే పరిమితం

తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు గత నెలలో నరసాపురం వచ్చిన చంద్రబాబు రైతులను అన్నివిధాలా వెంటనే ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా పరిహారం అందజేస్తామని చెప్పి వెళ్లారు.

ఇప్పటికి రైతులకు సాయం విడుదలపై ప్రభుత్వం ప్రకటన చేయకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. హెక్టారుకు రూ.70 వేల వరకు పెట్టుబడి ఖర్చులు అయ్యాయని, తుపాన్లతో పంట మొత్తం చాలాచోట్ల చేలోనే కుళ్లిపోయిందని వాపోతున్నారు. నేలనంటిన చోట మొలకలు రావడం, రంగుమారడంతో పెట్టుబడులు దక్కవంటున్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, క్రాప్‌ ఇన్సూరెన్స్‌ అందజేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

అతీగతీలేని మోంథా సాయం

గత ఖరీఫ్‌లో మోంథా తుపానుతో జిల్లాలోని 9,200 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లి ఏడాదవుతోంది. రూ.23 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ, క్రాప్‌ ఇన్సూరెన్స్‌ను చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికి ఇవ్వలేదని రైతులు విమర్శిస్తున్నారు. ఇటీవల నరసాపురం పర్యటనలో రైతులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లగా సమాధానం దాటవేశారంటున్నారు.

క్షీరాబ్ధి ద్వాదశిని పురస్కరించుకుని చిన వెంకన్న దివ్యక్షేత్రంలో శనివారం రాత్రి శ్రీవారి తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఉభయ దేవేరులతో శ్రీవారు హంసవాహన తెప్పపై సుదర్శన పుష్కరిణిలో జలవిహారం చేస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. విద్యుద్దీప కాంతులు, బాణసంచా వెలుగులు, మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణలు, గోవింద నామస్మరణల నడుమ వేడుక సాగింది. ముందుగా ఉత్సవమూర్తులను ఊరేగింపుగా సుదర్శన పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ హంస వాహన తెప్పపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ ఎస్వీ సుధాకరరావు కుటుంబసభ్యులు, ఈఓ వేండ్ర త్రినాథరావు సతీమణి భాగ్యలక్ష్మి పూజాదికాలు చేశారు. అనంతరం శ్రీవారి తెప్ప జలవిహారం చేసింది. పుష్కరిణి మధ్యలోని మండపంలో ఉత్సవమూర్తులను కొలువుదీర్చి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈఈ డీవీ భాస్కర్‌, ఏఈఓ వాసు, సూపరింటెండెంట్‌ బీఎస్‌ జగదీష్‌ ప్రసాద్‌, ఐవీ రామారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

–ద్వారకాతిరుమల

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విపత్తులు వచ్చినప్పుడు నాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెల రోజుల్లోపే ఇన్‌పుట్‌ సబ్సిడీ అందజేసి అండగా నిలిచారు. రైతులు చెల్లించాల్సిన క్రాప్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించేలా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలుచేశారు. ఆయన హయాంలోని ఐదేళ్లలో జిల్లాలో ని 1,09,556 మంది రైతులకు రూ.103.44 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీని అందజేశారు. బీమా పరిహారంగా 1,14,011 మంది రైతులకు రూ.217.64 కోట్లు అందించి ఆదుకున్నారు. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేయడంతో పాటు రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ సాయం విడుదల చేయకపోవడం గమనార్హం.

మండలం రైతులు పంట నష్టం నష్టం విలువ

(హెక్టార్లలో) (రూ. కోట్లలో)

ఆచంట 5,756 3,751.99 27.54

ఆకివీడు 1,838 1,348.76 9.90

అత్తిలి 8,908 5,053.82 37.11

భీమవరం 2,565 2,184.68 16.04

గణపవరం 5,537 3,967.57 29.13

ఇరగవరం 7,276 4,601.50 33.79

కాళ్ల 1,447 1168.96 8.58

మొగల్తూరు 381 218.30 1.60

నరసాపురం 3,496 2,383.84 17.50

పాలకోడేరు 5,177 3,798.98 27.89

పాలకొల్లు 5,801 3,400.72 24.97

పెంటపాడు 11,434 7,333.53 53.85

పెనుగొండ 4,825 3,591.19 26.37

పెనుమంట్ర 5,794 3,967.99 29.13

పోడూరు 6,087 4,436.14 32.58

తాడేపల్లిగూడెం 11,405 7,623.71 55.98

తణుకు 6,320 4,080.92 29.96

ఉండి 3,894 3,346.34 24.57

వీరవాసరం 6,357 4,529.22 33.26

యలమంచిలి 4,108 2,181.28 16.02

సాయంపై నోరుమెదపరే !

అర్నబ్‌, మురసు తుపాన్లతో జిల్లాలో 72,970 హెక్టార్లలో పంట నష్టం

2.2 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి తగ్గుతున్నట్టు తేల్చిన అధికారులు

నష్టం విలువ రూ.586 కోట్లు

రైతులకు రావాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.182.42 కోట్లు

సాయం విడుదలపై నోరుమెదపని చంద్రబాబు సర్కారు

ఏడాదైనా మోంథా సాయం అందించని వైనం

ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీతో రైతులను ఆదుకున్న జగన్‌ సర్కార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement