న్యూస్‌రీల్
పీవీఎల్‌కు కూటమి షాక్
జెడ్పీ చైర్మన్ పదవిని ఆశించిన ఉండి జనసేన జెడ్పీటీసీ సభ్యుడు పీవీఎల్ నరసింహరాజుకు కూటమి గట్టి షాక్ ఇచ్చింది. పదవి ఆశించిన పీవీఎల్‌కు భంగపాటు తప్పలేదు. 8లో u
ప్రశాంత పశ్చిమగోదావరి జిల్లాకు దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసకాండను కూటమి పార్టీలు పరిచయం చేశాయి. ఎన్నడూ లేనివిధంగా తారాస్థాయిలో కౌన్సిలర్లను బెదిరించడం, మాట వినకపోతే దాడి చేయడం, అప్పటికీ భయపడకపోతే ఇళ్లకు నిప్పు పెట్టడం, ఆస్తుల విధ్వంసాలకు జనసేన నేతలు తెగబడుతున్నారు. తాడేపల్లిగూడెంలో ఓ మాజీ రౌడీషీటర్ నేతృత్వంలో పోలీసుల సహకారంతో భారీగా దౌర్జన్యకాండకు తెరదీయడం చర్చగా మారింది. అక్కడ నామినేషన్ వెనక్కి తీసుకోని వైఎస్సార్‌సీపీ మహిళా కౌన్సిలర్ అభ్యర్థి ఇంటిని తగలపెట్టడం తీవ్ర కలకలం రేపింది. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు.
అధికారం ఇచ్చింది ఇళ్లు తగులబెట్టడానికా?
శనివారం శ్రీ 21 శ్రీ నవంబర్ శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో మలి విడతలో నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కూటమి నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసుల వేధింపులు, బెదిరింపులతో పాటు మాజీ రౌడీషీటర్లే రంగ ప్రవేశం చేసి దాడులకు దిగుతున్నారు. తణుకులో 16వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తానేటి శాంతకుమారిని బెదిరించి నామినేషన్ విత్‌డ్రా చేయించారు. అలాగే 21వ వార్డులో అభ్యర్థి నిమ్మకాయల బాలాజీ ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తుండగా.. పచ్చ బెదిరింపులకు లొంగకపోవడంతో నేరుగా కంపెనీ యాజమాన్యంతో బెదిరించారు. దీంతో అనివార్యంగా ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు.
తాడేపల్లిగూడెంలో పరాకాష్టకు..
తాడేపల్లిగూడెంలో జనసేన నేతలు మున్సిపల్ ఎన్నికలను పరాకాష్టకు తీసుకువెళ్లారు. దాడులు, కిడ్నాప్ యత్నాలతో అలజడి సృష్టిస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నామినేషన్ ఉపసంహరణ బాధ్యతను మాజీ రౌడీషీటర్, పట్టణంలో పేరొందిన పైబోయిన వెంకటరామయ్యకు అప్పగించారు. దీంతో వార్డుల వారీగా బెదిరింపులకు తెగబడ్డారు. 12వ వార్డు నుంచి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దాసం గణపతి ఇంటికి వెళ్లి ఆయన భార్యను బెదిరించి, ఆ తరువాత గణపతిని పిడిగుద్దులు గుద్ది నామినేషన్ విత్‌డ్రా చేయించారు. అలాగే 21వ వార్డుకు చెందిన పట్నాల గణపతిని తమదైన శైలిలో చిన్న ఫోన్ కాల్‌తో హడావుడి చేసి విత్‌డ్రా చేయించారు. ఇక 11వ వార్డు కొమ్మూరు కుసుమకుమారిని బెదిరించి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే టీమ్ పెదతాడేపల్లిలో తాడేపల్లిగూడెం టౌన్ ఎస్సై బాదం శ్రీనివాస్, పోలీసుల సమక్షంలో ఉంచి గురువారం ఉపసంహరణ చేయించారు. ఇక మరింత పరాకాష్టకు చేరి 38వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని నల్లగొండ స్వప్నను నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలని జనసేన నేత సింగం సుబ్బారావు బెదిరించాడు. మాట వినకపోయేసరికి స్వప్న పిల్లలను స్కూల్ నుంచి కిడ్నాప్‌నకు యత్నిస్తున్నారన్న సమాచారంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు వెళ్లి పిల్లలను బంధువుల ఇంటికి తీసుకువెళ్లిపోయారు. గురువారం ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తరువాత స్వప్న నివాసంలో ఉండగా రాత్రి సమయంలో ఆమె ఇంటికి నిప్పంటించారు. దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళితే తాడేపల్లిగూడెం పోలీసులు పెన్ను, పేపరు వెళ్లి తెచ్చుకోమంటూ వెటకారంగా మాట్లాడారని స్వప్న ఆవేదన వ్యక్తం చేశారు.
దాడులు.. దౌర్జన్యాలు
అడ్డదారిలో గెలవడానికి ఆరాటం
తాడేపల్లిగూడెంలో బరితెగించిన ఎమ్మెల్యే బొలిశెట్టి టీమ్
మాజీ రౌడీషీటర్‌తో దాడి, బెదిరింపులు, ఉపసంహరణలు
వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థిని ఇంటికి నిప్పు
తణుకులో ఉద్యోగం తీయిస్తామంటూ బెదిరింపులు
ప్రశాంత పశ్చిమలో దౌర్జన్య రాజకీయాలు
తాడేపల్లిగూడెం: ప్రజలు అత్యధిక మెజార్టీ ఇచ్చింది ప్రజల ఇళ్లు తగులబెట్టడానికా అంటూ వై ఎస్సార్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్ వడ్డి రఘురాం ప్రశ్నించారు. శుక్రవారం బాధిత నల్లగొండ స్వప్న కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. నియోజకవర్గంలో కూటమిని నడిపించే వారు చేసే అరాచకాలు అంబేడ్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడి చేలా ఉన్నాయని మండిపడ్డారు. నిమ్నవర్గాలు ఉన్నత స్థితికి చేరుకోవడాన్ని తట్టుకోలేరా అని ప్ర శ్నించారు. నామినేషన్ వేస్తే బెదిరింపులకు పా ల్పడతారా, కుటుంబాలను అపహరిస్తారా అని మండిపడ్డారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలకు ముగిస్తే రాత్రి 11 గంటల వరకు తుది జాబితాను మున్సిపల్ అధికారులు ప్రకటించలేదన్నారు. ఇంటికి నిప్పంటించినప్పుడు చుట్టూ ఉన్న ఇళ్లు తగలబడితే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. ఈ ఘాతుకాన్ని జాతీయ ఎస్టీ కమిషన్, హైకోర్టు దృష్టికి తీసుకువెళతానన్నారు. అగ్నిప్రమాదం జరిగిందని స్వప్న పోలీస్ స్టేషన్‌కు వెళితే పేపర్లు, పెన్నులు తెచ్చు కో వాలంటూ వెటకారంగా మాట్లాడి ఫిర్యాదు కూ డా స్వీకరించకపోవడం దారుణమన్నారు. నామినేషన్లు విత్‌డ్రా చేసుకోమని మున్సిపల్ ఉద్యోగులు ఎందుకు ఫోన్లు చేశారని ప్రశ్నించారు. చైర్మన్ అభ్యర్థి గొర్రెల శ్రీనివాసు ఉన్నారు.


