ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు జిల్లా ప్రజాపరిషత్ చైర్‌పర్సన్‌గా చింతమనేని సాయి నవ్యశ్రీ ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా ప్రజాపరిషత్ సమావేశపు హాలులో శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధ్యక్షతన జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగాయి. ముందుగా జిల్లాలోని 27 మంది జెడ్పీటీసీలు ప్రమాణస్వీకారం చేశారు. చైర్‌పర్సన్‌గా సాయి నవ్యశ్రీ, వైస్ చైర్మన్‌గా బొర్రా చలమయ్యను ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేలు బడేటి చంటి, కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా విజయం సాధించిన వేలేరుపాడు జెడ్పీటీసీ కుంజా కుమారి, బుట్టాయగూడెం జెడ్పీటీసీ కొర్సా బాలకృష్ణ, జీలుగుమిల్లి జెడ్పీటీసీ కొరసా సూరమ్మ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే కూటమి పార్టీల జెడ్పీటీసీలు కాట్రగడ్డ శంకర్‌రావు (మండవల్లి), కూరపాటి సుజాత (టి.నర్సాపురం), కొనకాల లక్ష్మీ (నూజివీడు), కోమలాదేవి బొంతు (కుక్కునూరు), గొల్లమందల సంకీర్తన (జంగారెడ్డిగూడెం), ఘంటసాల శ్రీనివాస్ (ఏలూరు), చలమయ్య బొర్రా (ముదినేపల్లి), చింతమనేని సాయి నవ్యశ్రీ (పెదవేగి), చింతల శ్రీనివాస్ (ఉంగుటూరు), చౌటపల్లి విక్రమ్‌కిషోర్ (పెదపాడు), జగన్నాథం అబ్బురం (చింతలపూడి), జాహ్నవి మందలపు (కామవరపుకోట), తేళ్లూరి శేఖర్ (చాట్రాయి), నల్లగోపుల వెంకటచలపతిరావు (కలిదిండి), నిమ్మకాయల గణపతి (భీమడోలు), పెనుబోయిన మహేష్‌బాబు (దెందులూరు), బలే ఏసురాజు (కై కలూరు), ముసునూరు వెంకట సరోజిని (లింగపాలెం), మైలవరపు రామలక్ష్మి (నిడమర్రు), మొగళ్ల జానకీ సత్య గోవర్ధన సౌమ్య (పోలవరం), మౌనిశ్రీ గద్దే (ముసునూరు), వాడపల్లి రమేష్ (కొయ్యలగూడెం), వీరాబత్తిన జోషిబాబు (ఆగిరిపల్లి), సత్యశ్రావణి కరుటూరి (ద్వారకాతిరుమల) ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రజాప్రతినిధుల డుమ్మా
జిల్లా విభజన తర్వాత తొలిసారి ఏర్పడిన ఏలూరు జెడ్పీ కార్యవర్గ ప్రమాణ స్వీకరానికి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు గైర్హాజరు కావడం చ ర్చనీయాంశంగా మారింది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ యాదవ్, మంత్రి కొలుసు పా ర్థసారథి, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గెర్హాజరయ్యారు.


