కొవ్వాడ గండ్లుతో తీరని నష్టం | - | Sakshi
Sakshi News home page

కొవ్వాడ గండ్లుతో తీరని నష్టం

Nov 21 2026 12:26 AM | Updated on Nov 21 2026 12:26 AM

● రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

● మాజీ ఎమ్మెల్యే బాలరాజు

పోలవరం రూరల్‌: ప్రభుత్వ అధికారుల వైఫల్యం కారణంగానే కొవ్వాడ కాలువకు భారీ గండ్లు పడి అపార నష్టం వాటిల్లిందని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ బుగ్గా మురళీకృష్ణ, మాజీ ఎంపీపీ సుంకర వెంకటరెడ్డితో కలిసి శుక్రవారం కొవ్వాడ కాలువకు పడిన గండ్లు ప్రదేశాలను, ఇసుక మేటలు వేసిన పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేలాది ఎకరాలు పంట పొలాలు ఇసుక మేటలు వేశాయని తీవ్ర నష్టం జరిగిందన్నారు. 20 ఏళ్ల క్రితం వైఎస్‌ హయాంలో కొవ్వాడ కాలువ గట్లు పటిష్టం చేసి ఔట్‌ఫాల్‌ స్లూయిజ్‌ నిర్మించారన్నారు. కొవ్వాడ కాలువ పొంగినా ఆ నీరంతా గోదావరి నదిలోకి చేరేదన్నారు. అయితే కాలువపై అధికారుల పర్యవేక్షణ కొరవడటం, స్లూయిజ్‌ గేట్లు సకాలంలో ఎత్తకపోవడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. గండ్లు పడిన ప్రదేశంలో నామమాత్రం మట్టి వేసి చేతులు దులుపుకోవడం కాదని, గట్లు శాశ్వత పరిష్కారంగా పటిష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇసుక మేటలు వేసిన పొలాలకు ఎకరాకు రూ.2 లక్షలు, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలన్నారు.

తడిసిన ధాన్యం కొనాలి : పట్టిసం గ్రామంలో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకున్న రైతులను మాజీ ఎమ్మెల్యే బాలరాజు కలిసి వారి కష్టాలను తెలుసుకున్నారు. వరుస తుపాన్లతో పంటలు అంతంతమాత్రంగానే దిగుబడి వచ్చాయని, ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే నాథుడు కరువయ్యాడన్నారు. ఇంత నష్టం జరిగినా అధికారులు గాని, నాయకులు తమను పట్టించుకోలేదని రైతులు వాపోయారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ మొ లకలు వచ్చినా, తడిసిన ధాన్యాన్ని వెంటనే అధికా రులు పరిశీలించి, కొనుగోలు చేయాలన్నారు. ఏ ఒ క్క రైతు కూడా నష్టపోకూడదన్నారు. నాయకులు క రిబండి నాగయ్య, ఆకుల బుజ్జి, తెలగంశెట్టి సూర్యచంద్రరావు, పొడుం శ్యామ్‌, సిగ్ధన వెంకటరత్నం, రైతులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement