తణుకు కూటమిలో విభేదాలు | - | Sakshi
Sakshi News home page

తణుకు కూటమిలో విభేదాలు

Nov 21 2026 12:26 AM | Updated on Nov 21 2026 12:26 AM

తణుకు కూటమిలో విభేదాలు

తణుకు అర్బన్‌: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో తణుకు కూటమిలో విభేదాలు తారస్థాయికి చేరాయి. సీట్ల కేటాయింపు, వార్డుల మార్పుపై అసంతృప్తి వ్యక్తమవుతుండగా, తాజాగా 39వ వార్డు వ్యవహారం కలకలం రేపుతోంది. పొత్తులో భాగంగా ఈ వార్డును బీజేపీకి కేటాయించగా, సీటు ఆశించి భంగపడ్డ టీడీపీ నేత మల్లిన రాధాకృష్ణ.. అదే వార్డులో కప్పు సాసర గుర్తుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొక్కిరాల లక్ష్మీ మణిమాలకు మద్దతుగా శుక్రవారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మారింది. బీజేపీ అభ్యర్థిగా ఉన్న జిల్లా మహిళా అధ్యక్షురాలు దొంగ సంతకాలతో నామినేషన్‌ వేశారని, ఆమె ఓటు తప్పుడు చిరునామాలో ఉందని, ప్రతిపాదకుడి సంతకమూ నకిలీదని ఆరోపించారు. బయటి ప్రాంతం నుంచి వచ్చి పోటీ చేస్తున్న ఆమెను గెలిపిస్తారా? స్థానికంగా ఉండే మణిమాలను ఆదరిస్తారా? అని ప్రజలను ప్రశ్నించారు. మణిమాల చిరు వ్యాపారాన్ని కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement