పరోక్ష ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పరోక్ష ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు

Nov 19 2026 2:55 AM | Updated on Nov 19 2026 2:55 AM

పరోక్ష ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు

కలెక్టర్‌ వెట్రిసెల్వి

ఏలూరు (టూటౌన్‌): జిల్లాలో జిల్లాపరిషత్‌, మండలపరిషత్‌ పరోక్ష ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు చేయాలనీ కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో జిల్లాపరిషత్‌, మండలపరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో–ఆప్షన్‌ సభ్యుల ఎంపికకు ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. గురువారం మండల పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో–ఆప్షన్‌ సభ్యులు, శుక్రవారం జిల్లాపరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో–ఆప్షన్‌ సభ్యుల ఎంపికకు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. సీట్ల ఏర్పాటు, ఎంపిక సమయంలో నిబంధనల ననుసరించి వ్యక్తులను మాత్రమే అనుమతించాలన్నారు. ఎక్కడైనా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధలు అనుగుణంగా వ్యవహరించాలన్నారు. జేసీ ఎంజే అభిషేక్‌ గౌడ, నూజివీడు సబ్‌ కలెక్టర్‌ బి.వినూత్న, జెడ్పీ సీఈఓ ఎం.కృష్ణమోహన్‌, డీపీఓ మల్లికార్జునరావు, రిటర్నింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement