చింతలపూడి అటవీ ప్రాంతంలోకి పెద్దపులి | - | Sakshi
Sakshi News home page

చింతలపూడి అటవీ ప్రాంతంలోకి పెద్దపులి

Nov 17 2026 12:44 AM | Updated on Nov 17 2026 12:44 AM

చింతలపూడి అటవీ ప్రాంతంలోకి పెద్దపులి ఈవీఎం గోడౌన్‌ తనిఖీ బియ్యం ధరలు పెంచితే ఊరుకోం వచ్చేనెలలో భీమవరం బాలోత్సవం

చింతలపూడి: చింతలపూడి మండలంలోని చింతంపల్లి అటవీ ప్రాంతంలోకి పెద్దపులి ప్రవేశించడం స్థానికంగా కలకలం రేపుతోంది. జీలుగుమిల్లి అటవీ ప్రాంతం నుంచి మందలపల్లి మీదుగా ఈ పెద్దపులి చింతంపల్లి, బర్రికొండ ఫారెస్ట్‌లోకి అడుగుపెట్టినట్లు అటవీ శాఖ అధికారులు సోమవారం అధికారికంగా గుర్తించారు. పులి సంచారం నేపథ్యంలో చింతంపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజ లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. గ్రామస్తులు ఎవరూ ఒంటరిగా అటవీ ప్రాంతాల్లోకి గానీ, పొలాల వద్దకు గానీ వెళ్లకూడదన్నారు. పశువుల కాపరులు తమ పశువులను అడవి లోపలికి మేతకు తీసుకెళ్లవద్దని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా రాత్రిళ్లు ప్రజలు బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పులి కదలికలను అటవీ శాఖ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఎవరికై నా పులి ఆనవాళ్లు కనిపిస్తే తక్షణమే అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

ఏలూరు (టూటౌన్‌): ఏలూరు కలెక్టరేట్‌ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్‌ను సోమవారం కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తనిఖీ చేశారు. గోడౌన్‌ వద్ద సీసీ కెమెరాలతో భధ్రతా ఏర్పాట్లను, ఈవీఎం యంత్రాలు బీయూలు, సీయూలు, వీవీప్యాట్‌లను పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పరిశీలన చేశామన్నారు. పటిష్ట భధ్రత కల్పించామన్నారు. ఇన్‌చార్జి డీఆర్వో జి.రవీందర్‌, ఎన్నికల విభాగం సిబ్బంది నాయక్‌ ఉన్నారు.

ఏలూరు (టూటౌన్‌): జిల్లాలో ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే బియ్యం విక్రయించాలని, అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని జాయింట్‌ కలెక్టర్‌ ఎంజే అభిషేక్‌ గౌడ హెచ్చరించారు. సోమవారం జిల్లాలోని రైతుబజారు ఎస్టేట్‌ అధికారులు, ధరల నియంత్రణ పర్యవేక్షణ కమిటీ సభ్యులు, వర్తకులు, రైతులతో ధరల నియంత్రణపై ఆయన సమీక్షించారు. బీపీటీ 3291 (సోనా), బీపీటీ 5204 (సాంబ), కేఎన్‌ఎం రకాలు కిలో రూ.66, ,హెచ్‌ఎంటీ, ఆర్‌ఎన్‌ఆర్‌ రకాలు కిలో రూ.76, జైశ్రీరామ్‌ రకం రూ.82, ఎంటీయూ కామన్‌ రకం రూ.47 చొప్పున విక్రయించాలన్నారు. నిబంధనలు మీరి విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. ఉల్లంఘనలపై జిల్లాలో 64 కేసులు నమోదు చేశామన్నారు. బియ్యం, నిత్యావసర ధరలు నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీఎస్‌ఓ బాబు విలియమ్స్‌, పౌర సరఫరాల సంస్థ అధికారి శివరామమూర్తి, ఉద్యాన శాఖ డీడీ సాజానాయక్‌, అధికారులు పాల్గొన్నారు.

భీమవరం: భీమవరం బాలోత్సవం నాల్గో పిల్లల పండుగ వచ్చేనెల 19, 20 తేదీల్లో స్థానిక ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించనున్నట్టు ఇందూకురి ప్రసాదరాజు చెప్పారు. సోమవారం బాలోత్సవం కమిటీ సమావేశం స్థానిక గాంధీ భవన్‌లో ఏర్పాటుచేసిన కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. భీమవరం రూరల్‌, అర్బన్‌, వీరవాసరం, పాలకోడేరు, ఉండి, కాళ్ల, ఆకివీడు మండలాల బాలబాలికలకు నిర్వహించే బాలోత్సవంలో వ్యాసరచన, వక్తృత్వం చిత్రలేఖనం తదితర 16 అకడమిక్‌ అంశాలు, అభ్యుదయ గేయాలు, శాస్ట్రీయ, జానపద నృత్యాలు తదితర 15 కల్చరల్‌ అంశాలపై బాలోత్సవాలు నిర్వహిస్తామన్నారు. బ్రోచర్లు, ఎంట్రీ ఫారమ్స్‌ త్వరలో వెల్లడిస్తామన్నారు. ప్రధా న కార్యదర్శి సీహెచ్‌ పట్టాభిరామయ్య, ఉపాధ్యక్షుడు గాతల జేమ్స్‌, కోశాధికారి పి.సీతారామరాజు, కల్చరల్‌ కన్వీనర్‌ బి.చైతన్యప్రసాద్‌, అకడమిక్‌ కన్వీనర్‌ పి.శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement