ప్రధాన పార్టీలైన టీడీపీ కూటమి, వైఎస్సార్‌సీపీలు చైర్‌పర్సన్ అభ్యర్థితో పాటు 23 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.. టికెట్ దక్కని అసంతృప్తులు రెబెల్స్‌గా బరిలోకి దిగుతారా.. లేక ప్రత్యర్థి శిబిరాల వైపు చూస్తారా.. అనే కోణాల్లో పార్టీ పెద్దలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. సర్వే నివేదికలు, కూటమి ధర్మం పేరుతో అధిష్టానం వేస్తున్న లెక్కలు కార్యకర్తల ఆగ్రహాన్ని ఏ మేరకు చల్లారుస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. గెలుపు గుర్రాల పేరుతో సొంత కార్యకర్తల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే, ఎన్నికల ఫలితాలపై దాని ప్రభావం తప్పకుండా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


