తెలుగు యువత నాయకుల అత్యుత్సాహం | Tdp Workers Overaction At Cid Sit Office | Sakshi
Sakshi News home page

తెలుగు యువత నాయకుల అత్యుత్సాహం

Oct 11 2023 8:44 AM | Updated on Oct 11 2023 9:09 AM

Tdp Workers Overaction At Cid Sit Office - Sakshi

తాడేపల్లి రూరల్‌: గుంటూరు జిల్లా కుంచనపల్లి­ప్రాతూరు రోడ్డులో ఉన్న ఏపీ సీఐడీ సిట్‌ కార్యాల­యం వద్ద మంగళవారం తెలుగు యువత నాయ­కులు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. సిట్‌ కార్యాలయం గోడలు దూకేందుకు ప్రయ­త్నం చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన పోలీ­సులతో వాగ్వాదానికి దిగారు. దీంతో వీఆర్వో ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

ఎస్‌ఐ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం... ఏపీ సీఐడీ కార్యాల­యం వద్ద ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు విష­యమై టీడీపీ నాయకుడు నారా లోకేశ్‌ను సిట్‌ అధి­కారులు విచా­రణ చేస్తున్నారు. ఆ సమయంలో బయ­టవారిని ఎవరినీ అనుమతించకుండా రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా కొందరు తెలుగు యువత నాయకులు... సిట్‌ కార్యాలయం వెనుక వైపు గోడదూకి లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు.

అక్కడ ఉన్న సెక్యూ­రిటీ, రెవెన్యూ సిబ్బంది వారిని అడ్డుకుని లోపలికి రావొద్దని పదేపదే చెప్పినా వినకుండా గోడదూకేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకోవ­డంతో దౌర్జన్యా­నికి పాల్ప­డ్డారు. అక్రమంగా లోప­లికి వచ్చేందుకు ప్రయత్నించినవారిపై వీఆర్వో మౌలాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న­వారిలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చిన్నబాబు, ప్రధాన కార్యదర్శి నూతలపాటి నాగ­భూషణం, అధికార ప్రతినిధి సజ్జ అజయ్, చందర్లపాడు మండల అధ్యక్షుడు కమ్మ గోపీచంద్, నందిగామకు చెందిన గుళ్లపల్లి ఠాగూర్‌బాబు, ఈపూరి వినోద్, ఏలూరు జిల్లా ఎన్‌ఆర్‌ పేటకు చెందిన నాయుడు పవన్‌ ఉన్నారని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement