పెదకాకాని: శివాలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలలో భాగంగా రెండో రోజు బుధవారం ఉదయం పవిత్ర సమర్పణ, విశేష ద్రవ్యహోమం, పూర్ణాహుతి, ఉపచారం, మంత్రపుష్పం, హారతి, విబూది, కుంకుమ ప్రసాద వితరణలు తదితర కార్యక్రమాలను ఆలయ స్థానాచార్యులు, ప్రధాన అర్చక, వేద పండితులు ఆధ్వర్యంలో నిర్వహించారు. చివరి రోజు గురువారం ఉదయం ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్, పాలకమండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావులు తెలిపారు. ఆలయ అధికారులు, కోసూరి పూర్ణచంద్రరావు దంపతులు, బండారు మల్లేశ్వరి దంపతులు, వుల్లం రాజేశ్వరి దంపతులు, ధూపాటి శివశంకరరావు, బైరపనేని ధనలక్ష్మి దంపతులు, ఎక్స్ అఫీషియో సభ్యులు పేటేటి ధన మహేశ్వర ప్రసాద్, భక్తులు పాల్గొన్నారు.


