చెరువులో మునిగి ఒకరి మృతి
చిన్నశంకరంపేట (మెదక్): సరదాగా కాసిన ఈత పందెం ప్రాణం తీసింది. మెదక్‌జిల్లా చిన్నశంకరంపేట మండలం ధరిపల్లిలో జరిగిన ఈ సంఘటనపై ఎస్‌ఐ శివానందం కథనం ప్రకా రం.. మంగళవారం గ్రామానికి చెందిన నల్ల సిద్దిరాములు (48)తోపాటు ఉప్పరి రాజు, బీరప్ప, ఎల్లం పందెం కాసి చెరువులో ఈతకు దిగారు. చెరువు ఇటువైపు నుంచి అటువైపు వెళ్లాలని పందెం వేసుకున్నారు. దీంతో ఉప్పరి రాజు, నల్ల సిద్దిరాములు చెరువులో ఈతకు దిగారు. మరో ఇద్దరు చెరువుకట్టపైనే ఉండి పోయారు.
అయితే ఈతకు వెళ్లిన ఉప్పరి రాజు తిరిగి రాగా, సిద్దిరాములు మాత్రం చెరువులో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీ సులు మంగళవారం రాత్రి చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఫలితం లేకపోవడంతో బుధవారం ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలతో గాలింపు చేపట్టారు. బుధవారం సాయంత్రం సిద్ది రాములు మృతదేహాన్ని గుర్తించి చెరువు నుంచి బయటకు తీశారు. సిద్దిరాములు భార్య రామవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్తన్నారు.


