జూరాల నుంచి దిగువకు 2,44,998 క్యూసెక్కుల నీటి విడుదల
గద్వాల: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ప్రాజెక్టుకు 2,48,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. జలాశయ నీటి నిల్వ సామర్థ్యం 9.567టీఎంసీలు కాగా.. ప్రసుత్తం 7.682 టీఎంసీల నీరు ఉంది. 33 గేట్లను ఎత్తి స్పిల్‌వే ద్వారా దిగువనకు 2,18,790 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ఆరు యూనిట్లలో విద్యు దుత్పత్తి చేపడుతూ మరో 26,208 క్యూసెక్కులు వదులు తున్నారు. ఎత్తిపోతల పథకాలకు కలిపి మొత్తం జూరాల నుంచి 2,48,791 ఔట్‌ఫ్లో కొనసాగుతుంది. కాగా.. శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచి స్పిల్‌వే, విద్యుదుత్పత్తి ద్వారా 2,44,998 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 866.9 అడుగుల నీటిమట్టం వద్ద 129.4646 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు 1,40,257 క్యూసె క్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 1,49,597 క్యూసెక్కుల నీటిని దిగువ నకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 123.081టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 111.162 టీఎంసీల నీరు ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టుకు 1,46,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 1,40,376 క్యూసెక్కుల నీటిని జూరాలకు వ దులుతున్నారు. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 33. 313 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 29.40టీఎంసీలుగా ఉంది.


