Hyderabad: రోడ్డు ప్రమాదంలో నర్సు మృతి | Nurse Dies in Road Accident | Sakshi
Sakshi News home page

Hyderabad: రోడ్డు ప్రమాదంలో నర్సు మృతి

Apr 28 2024 7:39 AM | Updated on Apr 28 2024 7:39 AM

Nurse Dies in Road Accident

మూసాపేట: ఆసుపత్రికి స్కూటీపై వెళుతున్న స్టాఫ్‌ నర్స్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ  సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది.  పోలీసులు తెలిపిన మేరకు.. జగద్గిరిగుట్టకు చెందిన ప్రశాంతి (37) భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేపీహెచ్‌బీ కాలనీలోని రవి హాస్పిటల్స్‌లో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తోంది. 

శనివారం జగద్గిరిగుట్టలోని ఇంటి నుంచి ఆసుపత్రికి సౌత్‌ ఇండియా షాపింగ్‌మాల్‌ నుండి వెళుతోంది. నెక్సాస్‌ షోరూమ్‌ వద్ద మలుపు వద్ద కూకట్‌పల్లి వైపు వేగంగా వెళుతున్న  వెనుకనుంచి వచి్చన డీసీఎం వ్యాన్‌ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు  గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని   తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement