వాట్సాప్‌ చాటింగ్‌లు, లావాదేవీలపై ఆరా! | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ చాటింగ్‌లు, లావాదేవీలపై ఆరా!

Published Mon, Mar 18 2024 5:17 AM

KTR, Harish Rao met Kalvakuntla Kavitha - Sakshi

కస్టడీలో తొలిరోజున కవితకు ప్రశ్నలు సంధించిన ఈడీ

ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన వారితో సంప్రదింపులపై ఆరా

ఈడీ కార్యాలయంలో ఆరు గంటల పాటు విచారణ

కవితను కలిసిన భర్త అనిల్, కేటీఆర్, హరీశ్‌రావు

లాయర్‌ విక్రమ్‌ చౌదరితో కేటీఆర్, హరీశ్‌ ప్రత్యేక భేటీ

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు తొలిరోజున ఆమెను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జోగిందర్‌ సింగ్‌ నేతృత్వంలో ఆదివారం ఈ విచారణ కొనసాగినట్టు తెలిసింది. ఈ కేసులో ఇతర నిందితులతో వాట్సాప్‌ చాటింగ్‌లు, కొందరు మధ్యవర్తుల ద్వారా జరిగిన లావాదేవీలు, లిక్కర్‌ స్కామ్‌లో లబ్ధి పొందేందుకు ముడు పులు ఇచ్చారన్న ఆరోపణలపై ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. అలాగే ఈ కేసులో ఇప్ప టికే అరెస్టు అయిన వారితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? వారితో ఏమేం సంప్రదింపులు జరిపారన్న అంశాలపై ఆరా తీసినట్టు తెలిసింది.

కేసులో అప్రూవర్లుగా మారినవారు ఇచ్చిన సమాచారాన్ని కవిత ముందుంచి.. దాని ఆధా రంగా పలు ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం ఆరుగంటల వరకు సుదీర్ఘంగా కొనసాగిందని.. మధ్యలో విరామం పోగా ఆరు గంటల పాటు కవితను ప్రశ్నించారని తెలిసింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ విచారణ మొత్తాన్ని ఈడీ అధికారులు వీడియో రికార్డు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.



కవితను కలసిన కుటుంబ సభ్యులు
ఆదివారం సాయంత్రం 5.50 గంటల సమ యంలో కవిత భర్త అనిల్‌కుమార్, కేటీఆర్, హరీశ్‌రావు, న్యాయవాది మోహిత్‌రావు తది తరులు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకు న్నారు. సుమారు రెండు గంటల తర్వాత రాత్రి 7.50 గంటల సమయంలో బయటికి వచ్చారు. మీడియాతో మాట్లాడకుండానే వెళ్లి పోయారు.

అయితే కవితను కలసిన సందర్భంగా.. ఏమాత్రం అధైర్యపడొద్దని, న్యాయం జరుగుతుందని వారు భరోసా ఇచ్చారని.. ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారని సమాచా రం. ఇక లాయర్‌ మోహిత్‌రావు పలు న్యాయ పరమైన అంశాలపై కవితకు సూచనలు చేసి నట్టు తెలిసింది. కాగా.. మాజీ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తదితరులు కూడా ఈడీ కార్యాలయా నికి చేరుకున్నా.. ఈడీ అధికారులు కవితను కలిసేందుకు వారిని అనుమతించలేదు.

విక్రమ్‌ చౌదరితో ప్రత్యేక భేటీ
మద్యం విధానం కుంభకోణం కేసులో కవిత తరఫున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ చౌదరితో కేటీఆర్, హరీశ్‌రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్, హరీశ్‌రావు తొలుత బీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. కాసేపటి తర్వాత విక్రమ్‌ చౌదరి నివాసానికి వెళ్లారు.

కవిత కేసు విచారణ విషయంలో న్యాయ అంశాలపై ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా వారు సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపై సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్, ముకుల్‌ రోహిత్గీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించినట్టు తెలిసింది. సుమారు రెండు గంటలపాటు ఈ సమావేశం జరిగిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.  

Advertisement
Advertisement