చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని కట్టమంచి వద్ద ఉన్న వ్యవసాయశాఖ కార్యాలయం (మామి డికాలయ మండీ) పక్కనున్న కల్వర్టులో గురువారం ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు పడిపోయాడు. చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తి ప్రమాదవసాత్తు పడిపోవడంతో స్థానికులు, పోలీసుల సాయంతో అతడిని బయటకు లాగడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక్కడున్న కల్వర్టుపై ఎలాంటి గేటు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు.
రెండు కుటుంబాల మధ్య ఘర్షణ
– ఒకరికి తీవ్రగాయాలు
శ్రీరంగరాజపురం : మండలంలోని పొదలపల్లి గ్రామంలో బుధవారం రాత్రి రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగి ఇకరికి తీవ్రగాయాలయ్యా యి. పోలీసుల కథనం మేరకు.. పొదలపల్లికి చెందిన శ్రీరాములు, జయరామయ్య కుటుంబ సభ్యుల మధ్య స్థలం విషయమై వివాదం నడుస్తోంది. ఇందులో భాగంగా బుధవారం రాత్రి ఇరు కుటుంబ సభ్యుల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. శ్రీరాములు తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు 108 ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తర లించారు. శ్రీరాములు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తునట్లు ఏఎస్‌ఐ గోవిందరాజులు తెలిపారు.
లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు
బంగారుపాళెం:మండలంలోని నలగాంపల్లె సమీపంలో చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ప్రైవేట్ బస్సు లారీని ఢీకొని రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. వేలూరు నుంచి మదనపల్లె వెళుతున్న ప్రైవేట్ బస్సు నలగాంపల్లె వద్దకు రాగానే టైరు పగిలిపోయింది. దీంతో డివైడర్‌ను దాటుకుని ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న మహారాష్ట్రకు చెందిన నీలేష్ (38) తీవ్రంగా గాయపడ్డాడు. పలువురికి స్వల్పగాయాలు తగిలాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన నీలేష్‌ను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
వెబ్ ఆప్షన్లకు సర్వర్ సమస్య
తిరుపతి సిటీ: జిల్లాలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ గడువు ముగియడంతో గురువారం నుంచి వెబ్‌ఆప్షన్లు నమోదు చేసు కోవాలని అధికారులు సూచించారు. ఓఏఎండీసీ వెబ్‌సైట్ సర్వర్ సమస్యతో ఓపెన్ కాకపోడంతో విద్యార్థులు ఉదయం నుంచి ఇంటర్ననెట్ సెంటర్లు, సచివాలయాల చుట్టూ చక్కర్లు కొట్టారు. వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదంటూ విద్యార్థులు డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌లను సంప్రదించంగా.. త్వరలో సాంకేతిక సమస్య పరిష్కారమవుతుందని, మరో గంటలోపు వెబ్‌ఆప్షన్లు ఓపెన్ అవుతా యని అధికారులు బదులిచ్చినట్టు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. 23వ తేదీ వరకు వెబ్‌ఆప్షన్లకు గుడువునిచ్చిన అధికారులు వెబ్‌సైట్ సమస్యపై దృష్టి సారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
24 నుంచి రాష్ట్ర స్థాయి పోటీలు
తిరుపతి ఎడ్యుకేషన్ : అమరావతి చాంపియన్‌షిప్–2026 రాష్ట్ర స్థాయి పోటీలను ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు తిరుపతిలో నిర్వహించనున్నట్లు శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది 10 రకాల క్రీడల్లో అండర్–22 విభాగంలో క్రీడా పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఏడాది 12 క్రీడల్లో అండర్–17, 23 విభాగాల్లో పోటీలను నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం అమరావతి చాంపియన్‌షిప్–2026 వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.


