సెప్టెంబర్ 5 లోపు అర్హులైన రైతుల జాబితా సిద్ధం చేయాలి రూ.4 మద్దతు ధర పారదర్శకంగా అందేలా చర్యలు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో మామిడి పంట సాగు చేసిన రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఆయన గురువారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ తోతాపురి మామిడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన కిలోకు రూ.4 మద్దతు ధర అర్హులైన రైతులందరికీ అందేలా చర్యలు చేపట్టాలన్నారు. అర్హత కలిగిన రైతుల జాబితాను సెప్టెంబర్ 5వ తేదీ లోపు సిద్ధం చేయాలని సూచించారు. ఫ్యాక్టరీలు, ర్యాంపులు, రైతు భరోసా కేంద్రాల్లో సేకరించిన వివరాలను భూమి పాసుపుస్తకం, బ్యాంకు ఖాతాలతో సరిపోల్చాలని ఆదేశించారు. ఒకే ట్రాక్టర్ నంబరుతో ఒకే రోజులో మామిడి కాయలను తోలిన రికార్డులు, కొన్ని ర్యాంపుల్లో భారీ మొత్తంలో నమోదైన వివరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మండల స్థాయిలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, ఆర్‌ఎస్‌కే సిబ్బందితో కలిసి గ్రామస్థాయిలో పరిశీలించి అనర్హులెవరైనా దరఖాస్తు చేసు కుని ఉంటే పరిశీలన చేపట్టాలన్నారు. ఈ– క్రాప్ నమోదుపైనే ఆధారపడకుండా క్షేత్రస్థాయిలో పంట వాస్తవంగా ఉందా లేదా అనేది నిర్ధారించాలని చెప్పారు. నమోదు లేకున్నా భౌతికంగా పంట ఉంటే నిబంధన ల ప్రకారం అర్హత కల్పించాలని స్పష్టం చేశా రు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధి కారి మురళి, జిల్లా ఉద్యానవన శాఖ అధికా రి సతీష్, హార్టికల్చర్ అధికారి కోటేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.


