చిత్తూరు కార్పొరేషన్: స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సిద్ధం కావాలని జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు ఆదేశించారు. ఆయన గురువారం జిల్లాలోని ఎంపీడీఓలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలన్నారు. అలాగే పంచాయతీలు, మండలాల వారీగా పోలింగ్ కేంద్రాలు జాబితాను తయారు చేయాలన్నారు. ఇప్పటికే పోలింగ్ బాక్స్‌లు జిల్లాకు చేరాయని, పంచాయతీల వారీగా ఉన్న రిజర్వేషన్ వివరాలతో పాటు సంబంధింత స్టేజ్–1 ఆఫీసర్(గెజిటెడ్ ఆఫీసర్) సంబంధించి మ్యాపింగ్ చేయాలన్నారు. మండలాలు, పంచాయతీల వారీగా జనాభా, కులాలవారీగా ఓటర్లు, పోలింగ్ కేంద్రాల వివరాలను ఒకే ఫార్మాట్‌ను సిద్ధం చేయాలని సూచించారు. 4–5 పంచాయతీలకు ఒక గెజిటెడ్ ఆఫీసర్ పర్యవేక్షిస్తారని, వారిని మానిటర్ చేయడానికి రూట్ ఆఫీసర్, మానిటర్ ఆఫీసర్లు ఉంటారని పేర్కొన్నారు. వీరంతా టీమ్‌గా ఏర్పడి ఎన్నికలను నిర్వహించాలన్నారు. రోజువారీ పనులతో పాటు ఎన్నికల పనులు కూడా చేయాలన్నారు. సెప్టెంబర్ 25 వరకు జెడ్పీ పాలకవర్గం సమయం ఉండడంతో ఆ తర్వాత జిల్లాల విభజన జరుగుతుందన్నారు. తదుపరి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వివరించారు. కార్యక్రమంలో ఏఓలు తదితరులు పాల్గొన్నారు.


