చిత్తూరు కలెక్టరేట్ : కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమా న్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నేడు పోలీసు గ్రీవెన్స్ డే
చిత్తూరు అర్బన్ : చిత్తూరులోని వన్‌టౌన్ పక్క న్న ఉన్న ఆర్ముడు రిజర్వు కార్యాలయంలో సోమవారం ప్రజాఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్‌డూడీ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు నేరుగా తనను కలిసి సమస్యలను తెలియజేయవచ్చని పేర్కొన్నారు. వాటిని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
చిత్తూరు కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. వినియోగదారులు ఉదయం 8.30–9.30 గంటల మధ్య 7993147979 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు తెలియజేయాలని వివరించారు. వాటిని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
నేడు షైనింగ్ స్టార్స్
అవార్డులు ప్రదానం
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని పదో తరగతి, ఇంటర్‌లో ప్రతిభ చూపిన 202 మంది విద్యార్థులకు సోమవారం షైనింగ్ స్టార్స్ అవార్డులు అందజేయనున్నట్లు ఇన్‌చార్జి డీఈఓ వెంకటేశ్వరరావు తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో మధ్యా హ్నం రెండు గంటలకు కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల కు సంబంధించి 168 మంది, జూనియర్ కళాశాలలకు సంబంధించి 34 మంది విద్యార్థులు ఎంపికయ్యారని తెలిపారు. వీరిలో ఓసీ 58 మంది, బీసీ 60 మంది, ఎస్సీ 32 మంది, ఎస్టీ 18 మంది ఉన్నారని, ఇంటర్‌లో ఓసీ, బీసీ, ఎస్సీల కు సంబంధించి ఏడుగురు చొప్పున, ఎస్టీ నలుగురు, సీడబ్ల్యూఎస్‌ఎన్ 3, మైనార్టీ–6 సంబంధించి ఆరుగురు ఉన్నారని తెలిపారు. అత్యధికంగా చిత్తూరు అర్బన్ మండలం నుంచి పదో తరగతి లో 9 మంది, ఇంటర్‌లో 14 మంది ఎంపిక కాగా తర్వాత పూతపట్టు మండలం నుంచి పదో తర గతి 8 మంది, గంగవరం మండలం నుంచి ఇంటర్‌లో ఎనిమిది ఉన్నారని తెలిపారు. షైనింగ్‌స్టార్స్ అవార్డు కింద రూ.20 వేల చెక్కు, ప్రశంసా పత్రం అందజేస్తామని వెల్లడించారు. విద్యార్థితో పాటు తల్లి లేదా తండ్రితో కలిసి ఎంఈఓ–2 కార్యక్రమానికి హాజరుకావాలని వివరించారు.
వైభవంగా
యాదవ సంఘం మహాసభ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలో ఆదివారం అఖిల భారత యాదవ మహా సంఘం చిత్తూరు జిల్లా ప్రథమ మహాసభలు వైభవంగా నిర్వహించారు. పి.నవీన్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు జాతీ య అధ్యక్షుడు బుసగాని లక్ష్మయ్య యాదవ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాదేవి గంగయ్య యాదవ్‌తో పాటు దాదాపు 700 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా నూతన అధ్యక్షుడిగా పి.నవీన్ యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆవుల గోపీయాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలిగా రాణి యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీవెంకటేశ్వర స్వామి మొదట దర్శించుకున్న శరభయ్య యాదవ్ విగ్రహాన్ని తిరుమలలో ప్రతిష్టించడంతో పాటు ఆయన పేరుతో మఠాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. యాదవ కార్పొరేషన్‌కు రూ.100 కోట్ల నిధులు కేటాయించాలని, దేశంలో కులగణన చేపట్టి చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. యాదవులపై జరుగుతున్న దాడుల నివారణకు బీసీ రక్షణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని కోరారు.
అలరించిన నాటకం
తిరుపతి కల్చరల్ : తిరుపతి మహతి కళాక్షేత్రంలో ఆదివారం ప్రదర్శించిన పౌరాణిక, సాంఘిక నాటక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అభినయ ఆర్ట్స్ 26వ వార్షికోత్సవంలో భాగంగా చేపట్టిన జాతీయ నాటక, నృత్య పోటీలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఆనందనిలయం, అనగనగా ఓ రాత్రి, నెట్ నాటికలు సందేశాత్మకంగా సాగాయి.


