బంగారుపాళెం : లివర్ సమస్యతో బాధపడుతున్న తమ బిడ్డకు ప్రాణభిక్షపెట్టాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. వివరాలు.. బంగారుపాళెం మండలం తగ్గువారిపల్లెకు చెందిన అమాన్ చికెన్ సెంటర్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య గుల్షన్, ఇద్దరు కుమారైలు ఉన్నారు. అమాన్ రెండో కుమారై షాజియా(4)కు ఈ నెల 8వ తేదీన జ్వరం రావడంతో చిత్తూరులోని ఓ ఆస్పత్రిలో చూపించారు. అక్కడి వైద్యుడి సూచన మేరకు చీలాపల్లె సీఎంసీకి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆ పాపకు బ్లడ్ ఇన్‌ఫెక్ట్ అయ్యిందని, లివర్ సమస్య ఉందని చెప్పి వేలూరు సీఎంసీకి పంపించారు. తర్వాత చైన్నెలోని రేలా ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి చిన్నారి షాజియాకు లివర్ మార్పిడి చేయాలని సూచించారు.. అందుకు రూ.30లక్షలు వెచ్చించాల్సి ఉంటుందని వెల్లడించారు. దీంతో ఆ నిరుపేద తల్లిదండ్రులు దిక్కు తోచని స్ధితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రూ 30 లక్షలు సమకూర్చలేక, బిడ్డ ప్రాణాలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ మేరకు 8688754556 నంబర్‌లో సంప్రదించాలని విన్నవిస్తున్నారు.


